హైదరాబాదు ట్రాఫిక్

హైదరాబాదు ట్రాఫిక్ గురించి వివరించి చెప్పాల్సిన పని లేదు. అది ఎలా ఉంటుందో హైదరాబాదులో రెండు రోజులున్నా చాలు ఎవరికైనా అర్థమవుతుంది. రైజ్ నెట్ వర్క్ లో సమీర్ మెహతా అనే వ్యక్తి పోస్టు చూసాను. ఇతను నార్త్ ఇండియన్ . సం టోటల్ సిస్టంస్ లో పని చేస్తున్నారు. ఇక్కడి ట్రాఫిక్ కి విసుగు చెంది ముఖ్యంగా హై టెక్ సిటీలో సో కాల్డ్ చదువుకున్న వాళ్ళ వ్యవహారం, నిబంధనలు పాటించకపోవడం ఇలాంటివి విసుగు తెప్పించి, అసహనం కలిగి, దీని మీద పని చేయాలని నిర్ణయం తీసుకున్నాడట. మొదటగా బ్లాగు ని మొదలుపెట్టి రైజ్ నెట్ వర్క్ లో పోస్టు చేసాడు.

ఆశ్చర్యపోయాను. నా వరకు నాకు కొన్ని సమస్యలు వేలు పెట్టలేనివని ఒక అభిప్రాయం ఉండేది. బాగైతే బాగుండు అని తప్పితే వీటి గురించి కూడా ప్రయత్నం చేయచ్చు అనిపించేది కాదు. వృథా ప్రయాస అనో లేదా మనల్ని చూసి జనం తప్పక నవ్వుతారు అనో బలమైన అభిప్రాయం ఉండేది. కాకపోతే ప్రతి అభిప్రాయం తప్పే అని నిరుపణ అవుతోంది. బత్తీ బంద్, ట్రాఫిక్, ఆర్ టి ఐ యాక్ట్ అందుకు ఉదాహరణలు.

వాళ్ళు హై టెక్ సిటీతో మొదలుపెట్టారు. అప్పుడు కూడా యథా ప్రకారం ఉడతా సాయం లాగా ఈనాడు విలేఖరుల వివరాలు, నాకు తెలిసిన గుంపులలో విషయం గురించి చెప్పడం ఇలాంటివి చేసాను. మనం ప్రత్యక్షంగా పాల్గొనకపోయినా ఒక మంచి పనికి వీలైనంత చేయూతని ఇవ్వాలని నా ఉద్దేశ్యం. చేసే వారికి నా వంతు సాయపడాలనే ఉత్సాహం. ఓ విషయం గురించి పది మందికి తెలియచెప్పడం కూడా అవసరమే. ప్రయోజనకరమే.

బత్తీ బంద్ గురించి, బి. వొ. ఎస్ . ఎఫ్ . న్యూస్ లెటర్ గురించి మళ్ళీ సమీర్ తో మాట్లాడటం మొదలెట్టాను. అంతలోనే ఎం . ఎం . టి . ఎస్ . వాళ్ళు కూడా ప్రత్యేకంగా ఓ గుంపు/సమూహము ని మొదలెట్టారని పత్రికల ద్వారా తెలుసుకున్నాను. అలాగే ఫాజిల్ ఫ్యుయెల్స్ కి వ్యతిరేకంగా తమ బృహత్ ప్రయత్నాన్ని మొదలెట్టిన మురళి మరియు అతని స్నేహితుల గురించి.

మెట్రో కి ప్రత్యామ్నాయం

ఇది ఇలా ఉండగా ఆర్ . టి. ఐ. యాక్ట్ గురించిన ఒక సమావేశంలో ప్రొఫెసర్ రామచంద్రరావు గారిని కలవడం జరిగింది. ఆయన బి. ఆర్ . టి. ఎస్. అనే ఒక పద్ధతి గురించి చెప్పారు. ఈ పద్ధతి వివిధ ప్రపంచ దేశాల్లో చక్కగా అమలవుతోందని, ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని, ముఖ్యంగా మన అవసరాలకు సరిపోతుంది అని చెప్పారు. మెట్రో వల్ల ఏ మాత్రం ఆశించిన ప్రయోజనాలు దక్కవని ఆయన అభిప్రాయం. లోక్ సత్తా వాళ్ళు కూడా పదే పదే ఇదే మాట చెప్తూ వస్తున్నారు.

ఢిల్లీకి చెందిన ప్రొఫెసర్ దినేష్ మోహన్ అనే ఆయన ఈ అంశం పై ఎంతో పరిశోధన చేసి, ఈ పధ్ధతి మన దేశ పరిస్థితులకు, అవసరాలకు సరిగ్గా సరిపోతుందని వివరిస్తూ వ్యాసాలు వ్రాసారట. అలా కొంత మంది ఈ అంశం మీద కృషి చేయాలని నిర్ణయించారట. ఢిల్లీలో జరిగిన ఒకానొక సమావేశానికి ప్రొఫెసర్ రామచంద్రయ్య గారు కూడా హాజరయ్యారట. హైదరాబాదులో కూడా ఓ పెద్ద సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యోచిస్తున్నారట. రాజకీయ నాయకులకి కూడా ఈ పధ్ధతి గురించి వివరిస్తూ వస్తున్నారట.

ఎవరిలోనైనా నాకు అత్యంత నచ్చే అంశం వారు నమ్మిన సిధ్ధాంతం పట్ల గల నిబధ్ధత, ఏదో చేయాలనే తపన. రామచంద్రయ్య గారు పెద్దాయన. 45 సంవత్సరాల పైనే ఉంటుంది వయస్సు. కానీ ఎంత తపనతో ఈ అంశం గురించి చెప్పారంటే నాకు ఎంతో గౌరవం కలిగింది. నిజానికి వీళ్ళందరికీ వారి సబ్జెక్టుల్లో పరిశొధనలు చేసుకుంటే బోలెడు డబ్బులు వస్తాయి. కానీ అలా పుస్తకాలకే పరిమితం కాకుండా ఏమైనా చేయాలి అని తపించడం చూస్తే ఇలాంటి వారి నుంచి కదా మనం స్ఫూర్తి పొందాలి అనిపించింది. ఈయన ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ వ్యవస్థాపక సభ్యులు కూడాను. నాకు ప్రొఫెసర్ గారితో మాట్లాడే సమయం చిక్కలేదు. అందువలన ఆయన చేపట్టిన అంశాలన్నిటి గురించి వివరంగా చెప్పలేను.

ఎవరికి నేను చేయగలిగిన సాయమైనా ఒకటే. వీలైనంత ఎక్కువ మందికి విషయం అందేలా చేయడం. కాబట్టి నాకు ట్రాఫిక్ అనే అంశం మీద ప్రత్యేక ఆసక్తి లేకపోయినా కూడా ‘నేను సైతం ఉడత సాయం’ లాగా ఈ సమావేశానికి ఆసక్తి గల వ్యక్తులని ఒప్పించాను.

ఈ ఆదివారం అనగా 30 మార్చి నాడు సెంటర్ ఫర్ సోషల్ అండ్ ఎకనమిక్ స్టడీస్ కార్యాలయంలో సమావేశం జరుగుతుంది. ఉదయం పది గంటల నుంచి 12 గంటల వరకు ఉంటుంది. 

Topic: Hyderabad’s Public Transport Options: Metro or BRTS?
Day: Sunday
Date: 30th of March
Timings: 10 am to 12 pm
Venue: Center for Economic and Social Studies, Begumpet, Hyderabad
Speaker: Prof. Ramachandraiah
Contact Number: 9440035405.

Though the postal address is Begumpet, the office is in Punjagutta. CESS can be approached from two sides.

1. Those coming from Ameerpet, Punjagutta, Srinagar colony can enter Punjagutta colony thru the lane in front of the temple (opp.Srinagar colony road). Proceed straight till dead end along the lane. On the right, there will be a big gate. (Adjacent to the gate is Vasundhara Apartments). Once inside the premises (it’s a small campus), proceed to the main building.

2. Those coming from Greenlands side should take Greenlands-Ameerpet road. After Meridian Plaza, take first left lane (adjacent to ‘VIP World’ shop) and proceed straight till the end. There will be a gate with Genetics Institute’s board. Enter and proceed straight. CESS will be there.

If any confusion anywhere, please don’t hesitate to call Prof. Ramachandraiah on his mobile: 94400 35405.

మీరు కూడా వీలైనంత ఎక్కువ మందికి ఈ అంశం గురించి తెలియచేయండి.  ఈ సమావేశం వివరాలు చెప్పి హాజరయ్యేట్టు చూడండి. మీకు ఈ అంశం మీద ఏమైనా సందేహాలుంటే రామచంద్రయ్య గారికి మెయిల్ చేయండి: crchandraiah@gmail.com

ఇంతే సంగతులు…… చిత్తగించవలెను 🙂

ఈ పోస్టులో చెప్పిన గుంపులకు సంబంధించిన లంకెలు:

 http://groups.yahoo.com/group/MMTSTravellers/

http://groups.google.co.in/group/trafficinhyderabad 

http://groups.google.co.in/group/birdsofsamefeathers

బి. వొ. ఎస్. ఎఫ్. గుంపు ఫైల్స్ విభాగంలో చూస్తే మీకు సంబంధిత డాక్యుమెంట్లు కనిపిస్తాయి.

ప్రకటనలు