పసికందు గుండెలో రంధ్రాలు, నందలూరు, కడప

పసి గుండెకు రంధ్రాలు, ఛిద్రమైన తల్లితండ్రుల హృదయాలు – అనిపిస్తోంది ఓ పాప గురించిన వివరాలు చదివితే. ఎన్నో ఆశలతో ఎంతో కష్టపడి ఓ బిడ్డకి జన్మనిస్తారు. అలాంటిది ఆ బిడ్డ తమకు దూరమౌతుందని తెలిస్తే ఎంతగానో తల్లడిల్లరు !! 

This case is published in Surya Paper (Cuddapah Edition) on 09/03/08.

22 days baby girl, Nandaluru, Cuddapah Dt.

Baby Details:
Age: 25 Days
Father’s Name: Bujjaiah V
Mother’s Name: Santhamma
Profession: Coolie
Address: Konapuram (Vi),
         Nandaluru (M),
         Cuddapah (Dt)
Problem: Hole in the Heart

Cost of Operation: Rs. 2L

Contact Person: Surya Narayana 9949167690

Consultant Doctor: Dr. Janardhan (checked for Baby Sai charan also to whom we supported for Heart opeation @ Narayana Hrudayala in Last Jan)

మేము క్రితం సంవత్సరం జనవరిలో సాయిచరణ్ అనే 22 రోజుల అబ్బాయికి నారాయణా హృదయాలయ వారి సహాయంతో అక్కడ శస్త్రచికిత్స చేయించాము. అది చాలా క్రిటికల్ కేసు. అయినా దేవుడి దయ వల్ల ఆపరేషను విజయవంతమై పిల్లవాడు కోలుకున్నాడు.

సాయిచరణ్ తండ్రి రమేష్ ద్వారానే ఈ విషయం పవన్ కు తెలిసింది. ఇది కూడా తొందరగా స్పందించాల్సినటువంటి కేసు. బ్లాగరులు స్పందించండి.

మా వంతుగా మేము కిన్నెర మెమోరియల్ ఫౌండేషన్ మరియు స్మరామి ఫౌండేషన్ వారి సహాయాన్ని అర్థించాము. నారాయణా హృదయాలయ కు రమ్మని అడిగాము. వాళ్ళు వేరే పరీక్షలను పరిగణనలోకి తీసుకోరు. వారే పరీక్షలు జరుపుతారు. రమారమి 2000 రూపాయలు అవుతుంది. పరీక్షల తాలూకు రిజల్టుని బట్టి ఆపరేషను ఎంత త్వరగా చేయాలన్నది నిర్థారిస్తారు. మనం సగం డబ్బులు కట్టగలిగినా వాళ్ళు మిగతా సగం మాఫీ చేస్తారు.

మీరు పవన్ (098806-92680) కి ఫోన్ చేయవచ్చును. పవన్ ఈ-మెయిల్ ఐడి: urspa1@gmail.com  లేదా శ్రీ సూర్యనారాయణను సంప్రదించగలరు.

ప్రకటనలు

కేన్సర్ పేషంటు, అనంతపూర్

వెంకటరమణ అనే వ్యక్తి కేన్సర్ జబ్బుతో బాధపడుతున్నాడని ఈనాడు హెల్ప్లైన్ లో చదివిన మా బెంగుళూరు కార్యదర్శి పవన్ మాలో కొంతమందికి మెయిల్ చేసాడు. కొన్ని కారణాల వల్ల మేము మెడికల్ కేసెస్ తీసుకోవడం తాత్కాలికంగా ఆపివేసాము. అయినా సరే ఉడతా భక్తి మా దృష్టికి వచ్చిన కేసులకి సాయం చేస్తూ ఉంటాము. అదే విధంగా పవన్ తన స్నేహితుల దగ్గర నుంచి ఈ కేసు నిమిత్తమై 10,000 రూపాయలు సేకరించి మాకు పంపారు.

ఆ పేషంటు వాళ్ళు సోమవారం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రికి వచ్చారు. కొన్ని నెలలుగా వాళ్ళు ఇక్కడ ట్రీట్ మెంట్ పొందుతున్నారు.

పత్రికలో పడిన వివరాలు.
తేదీ: 19 జనవరి అనంతపూర్ లోకల్ ఎడిషన్

Eenadu Anantapur Local

Name: Venkata Ramana
Native: Yerravanka Palli, Nallamada (M), Ananthapur
           Near Kadiri
Dependents: Wife and Boy (2.5yr)
Profession: Tailor
Problem: Cancer
Treatment: Kemotherapy @ Indo-US Cancer Hospital, Banzara hills, Hyd
Frequency: 1 Injection for 20 days
Total: 6 times (3 injections already taken)
Cost: Rs. 30 k per 1 injection
Next Treatment Date: Mar 10th
Help Required: 25k before Mar 10th

వెంకటరమణ స్నేహితుడైన రాం ప్రసాద్ (9440968139)తో పవన్ మాట్లాడి వివరాలు కనుక్కున్నాడు. దానిని బట్టి వారు వాళ్ళ శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తున్నారు. వారి ప్రయత్నానికి స్నేహితుల, శ్రేయోభిలాషుల, వదాన్యుల తోడ్పాటు లభిస్తున్నది. అనంతపురానికే చెందిన సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కొందరు ఆఖరి ఇంజెక్షను కు అవసరమయ్యే 50,000 రూపాయలను ఇస్తామని చెప్పారు. ఇది కాక ట్రీట్ మెంట్ కు మరొక 25,000 అవసరమవుతుంది.

మాకు ఉన్న అనుభవము ద్వారా నేను పవన్ ని ఎం ఎన్ జె ఆంకాలజీ సెంటర్ గురించి వారికి తెలుపమని కోరాను. ప్రభుత్వ ఆసుపత్రి కనుక ఖర్చు తక్కువ అవుతుంది. పైగా అక్కడి డాక్టర్లు ఎంతో శ్రధ్ధగా చూస్తారు కూడా.

పవన్ కనుక్కోగా వాళ్ళు ఏమి చెప్పారంటే వీళ్ళు ముందుగా అక్కడికే వెళ్ళారని కాకపోతే ఇతనికి కీమోథెరపీకి అవసరమైన మందు ఆ ఆసుపత్రిలో లేనందున వీరు ఇక్కడ చేరారని. ఇప్పుడు ఇతను బాగానే కోలుకుంటున్నాడు. ఒకప్పుడు నమలలేని వ్యక్తి ఇప్పుడు చపాతీ తినగలుగుతున్నాడట. ఇంతవరకు మూడు ఇంజెక్షన్లు వేసారు. ఇంకా మూడు వేయాలి.

మా వైస్ ప్రెసిడెంటు చైతన్య మొన్న ఆసుపత్రికి వెళ్ళి వారిని కలిసాడు. వాళ్ళు ఇతనికేమి చెప్పారంటే ఇంత వరకు జరిగిన ట్రీట్ మెంటు అంతా కేవలం దాతలు ఇచ్చిన డబ్బుతోనే వీలైందని. అడ్మిషన్ కోసం మూడువేలు కట్టారు. సోమవారం అయిన మందుల ఖర్చు 17, 804 రూపాయలు. ఇవి కాక వాళ్ళకు రోజుకి 44 రూపాయలు అవుతుంది ఓ ఇంజెక్షను కోసం. వాళ్ళు ఇక్కడుండేంతవరకు అంటే శుక్రవారం వరకూ ఇలా వేయించుకుంటూ ఉండాలి. వారి దగ్గర ప్రస్తుతం 400 రూపాయలు మాత్రమే ఉంది.

చైతన్య 10,804 రూపాయలు కట్టాడు. ఇందులో మాకు మరో వెయ్యి రూపాయలు శ్రీ సాయి శ్రీనివాస్ అనే స్నేహితులు ఇస్తానని చెప్పారు. అంటే మా దగ్గర 196 రూపాయలు ఉంటుంది (అతని దగ్గర వేయి రూపాయలు తీసుకున్నాక). అందుకని మేము ఏమి చెప్పామంటే మళ్ళీ శుక్రవారం వస్తాము; ఈ లోపు ఎంత సేకరించగలిగితే అంత డబ్బు తీసుకుని ఇస్తాము అని.

బ్లాగు ద్వారా మాకు మంచి తోడ్పాటే లభిస్తోంది. అందువలన ఇక్కడ కూడా కొత్త కేసుల వివరాలు పోస్టు చేస్తుంటే ఏ కొంచెం సహాయం అందినా ఉపయోగమే అన్న ఆలోచనతో ఈ కొత్త విభాగం మొదలుపెట్టాను నా బ్లాగులో.

వివరాలకు మీరు వెంకట రమణ స్నేహితుడు రాంప్రసాద్ కు ఫోన్ చేయవచ్చు. చైతన్య (98660-82670) ద్వారా ఇప్పించదలిస్తే అతనికి ఫోన్ చేయండి.