గాంధీజీతో ఓ రెండు రోజులు

ఇదేమి శీర్షిక అనుకుంటున్నారా? అవునండి మీ అందరి చేత చదివించాలంటే ఇలాంటి శీర్షికే కావాలి.

విషయానికి వస్తే ఒకే గూటి పక్షులందరూ గత ఆగష్టులో వార్ధా వెళ్ళి వచ్చారు. నేను సైనస్ ప్రకోపించడం వల్ల వెళ్ళలేకపోయాను.

ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో ఉగాది రోజున గాంధీ గారిని కలవడానికి వెళ్తున్నాము. అవును మరి, ఆయన నివసించి, సంచరించిన చోటు, సమావేశ మందిరం ఇత్యాది వాటిని చూడడం అంటే ఆయన్ని కలిసినట్టే కదా.

మరి వెళ్ళే వాళ్ళం వెళ్ళక బ్లాగడం దేనికి అనుకుంటున్నారా? భలేవారండీ. మీ అందరినీ తీసుకు వెళ్ళకుండా ఎలా వెళ్ళగలం 🙂 అందుకే ముందుగా మీ అందరికీ తెలియపరిచి, ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అంగీకారం తీసుకుంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. అందరం కలిసి వివిధ విషయాల గురించి చర్చించుకుంటూ వెళ్తే అది ఎంతో విజ్ణ్జానదాయకంగా ఉంటుంది మరియు ఒక చారిత్రక ప్రదేశాన్ని చూసినట్టు ఉంటుంది. చదువుకునే పిల్లలు ఉన్న వారైతే పిల్లలకి ఇలాంటివి చూపించడం ఎంతో బాగుంటుంది.

ఉగాది ముందు నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి పక్కరోజు ఉదయం వార్ధా చేరుకుంటాము.  సేవాగ్రం లో అన్నీ చూసాక, పౌనర్ ఆశ్రమానికి వెళ్తాము. అక్కడి నుంచి వరోరా వెళ్తాము. బాబా ఆంటే గారు సేవ చేసిన ఆనందవనమే వరోరా.

ఈ ప్రయాణం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కింది లంకెలు చూడండి.

1.
http://simplethots.com/index.php?
option=com_content&view=article&id=2…

2. http://picasaweb.google.com/tapana2008/WardhaTripAugust2008#

3. http://picasaweb.google.com/asuresh18/NagpurSevagramRamesh#

4.
http://in.youtube.com/watch?v=c0uOQkJCJa0&feature=related

మీకు కూడా రావాలని ఉంది కదా. మరింకెందుకాలస్యం? మీ వివరాలు నాకు గురువారం (8 వ తేదీ) లోపల మెయిల్ చేయండి. కుదురుతుందో, లేదో అనుకుంటున్నారా? ఉగాది శుక్రవారం, శని, ఆది వారాంతం, ఇంకేమి కావాలి? ఇప్పుడు బుక్ చేసుకుంటే, అంతగా రాలేకపోతే రెండు రోజుల ముందు కేన్సిల్ చేసుకున్నా నష్టం ఉండదు.

The person who is responsible for the Wardha Ashram, Shri Jamnalal Bajaj:

http://wardha.nic.in/htmldocs/jbmain.asp

About Paunar:

http://gm.4mg.com/AboutWardha/pavnar_a.htm

http://www.maharashtra.gov.in/english/gazetteer/WARDHA/places_Pavnar.html

About Vinoba ji:

http://www.mkgandhi.org/associates/Vinoba.htm

ఇంతకీ మీరందరూ వస్తే నాకేంటి లాభం అనుకుంటున్నారా? ఉందండి. ఒకే గూటి పక్షులందరినీ ఒక దగ్గర సమావేశపరిచి, ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునే ఆనందం నేను పొందే లాభం.

ప్రకటనలు

గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం – 2

ఇవాళ నాకు గౌతమీ ఆశ్రమ వివరాల బ్రోచర్ అందింది. ఆ ఆశ్రమ చరిత్ర చదువుతూ ఉంటే రోమాలు నిక్కబొడుచుకున్నాయి అంటారే అలాంటి అనుభూతి. నాకైతే హృదయం ఉప్పొంగడం లాంటి భావన. ఎప్పుడూ కూడా మనం సినిమాల్లోని భాషని డైలాగులంటాము. కానీ ప్రతి అక్షరం ఎంత సత్యమో నాకు కొన్ని ఏళ్ళగా అనుభవం లోకి వస్తోంది. రచయితలు వాడే భాష నిజంగా అనుభవైకవైద్యమేనేమో.

ఆశ్రమాన్ని చూసినప్పటికంటే చదువుతున్నప్పుడు ఇంకా ఎంతో ఆనందం కలుగుతోంది. ఈ ఆశ్రమాన్ని కాపాడుకోవడం మనందరి కర్తవ్యం. స్వాతంత్ర్య సమరయోధుల కలలకి ఈ ఆశ్రమం నిలువెత్తు సాక్షి. ఆ బ్రోచర్ లో ఒక చోట ఇలా వ్రాసారు: ఈ ఆశ్రమ శంఖుస్థాపనకి పెట్టిన ముహూర్తబలమో, లేదా స్థలం ఇచ్చిన వారు, సేవ చేయాలనుకునే వారి సంకల్ప బలమో ప్రతిదీ చాలా అద్భుతంగా సమకూరింది అని. ఎందరో త్యాగధనుల సంకల్పబలాన్ని మనం నిరూపించాలి.

మన జాతీయ పతకాన్ని, మన జెండాని తగలబెడ్తాము, ఎవరడ్డొస్తారో చూస్తాము అని పోలీసు ఇన్స్పెక్టర్ ముస్తఫా అలీ ఖాన్ సవాలు చేస్తే 70 సంవత్సరాలు పై బడిన గుత్తి సుబ్బరాజు గారు ముందుకు వచ్చి ‘నన్ను పడగొట్టందే ఈ జెండాను నీవు పీకలేవు ‘ అంటూ ముందుకు వచ్చినప్పుడు పోలీసులు బిత్తరపోయి ఆయనను అరెస్టు చేయడం తప్ప ఏమీ చేయలేకపోయారట. ఎంత స్ఫూర్తినందించే విషయం.

అప్పట్లో ప్రజలు ఎన్నెన్ని త్యాగాలు చేసారు. వాళ్ళతో పోల్చుకుంటే మనం ఎంత. ఉత్తేజంతో పాటు నిస్పృహ కలుగుతోంది. మన భూభాగం మీద పరాయి వారి హక్కు, అధికారం ఉండద్దు, మన భూమిని మనమే పరిపాలించుకోవాలి అనే ఆశయంతో పోరాడి అమూల్యమైన స్వాతంత్ర్యాన్ని మన ముందు తరం మనకందిస్తే, ఇప్పుడు అదే భూమిని సెజ్ ల పేరుతో మళ్ళా దారాధత్తం చేస్తున్నాము. యె డీం డ్ ఫారిన్ టెరిటరీ……. ఎవరైనా నిర్వచించగలరా….. !!! చదువుకున్న వాళ్ళు కూడా ఈ సో కాల్ డ్ అభివృధ్ధి (నిజంగా జరిగేది, ఒరిగేది దేవుడెరుగు) అనే మాయలో పడి ఇవి మనకు ఎంతో ఉపయోగం అంటూ మాట్లాడితే ఎంతో బాధ కలుగుతుంది.

ఇవాళ ఆంధ్రజ్యోతిలో సంగం లక్ష్మీబాయమ్మ అనే సమరయోధురాలి గురించి వ్రాసారు. ఆ ఒక్క కాలం (నిజంగానే ఓ చిన్న కాలం ) చదివితేనే ఎంతో ఆశ్చర్యంగా అనిపించింది. ప్రతి చిన్న విషయాన్ని వారు ఎలా పట్టించుకునేవారో, ప్రతి చిన్న అంశంలో కూడా దేశభక్తిని చూపేవారో చదువుతుంటే ఆశ్చర్యం కలిగింది. వాళ్ళెక్కడ !! మనమెక్కడ !!

ఇక విషయానికి వస్తే…. మురళీ వాళ్ళ కంపెనీలో మాట్లాడాడు. వారు సూత్రప్రాయంగా ఒప్పుకున్నారు. సోమవారం వివరాలు అన్నీ పంపిస్తే కనీసం ఓ ఐదు కంప్యూటర్లైనా ఇవ్వచ్చు. మా టిమాడ్ గ్రూపు తరపున 30 రగ్గులు ఇద్దాము అని ఆలోచన. ఇవాళ బ్రోచర్ అందింది అని చెప్పడానికి ఫోన్ చేసినప్పుడు మిగతా అవసరాల గురించి అడిగాను. ఒక లేజర్ ప్రింటర్ (వాడినదైనా పర్లేదు), పిల్లలు కూచునేందుకు ఓ పది బల్లలు అడిగారు.

త్రినందా ఫౌండేషన్ సతీష్ గారిది పిఠాపురమట. దీపావళి పండగ సందర్భంగా ఆయన వారి ఊరిలోనే ఉన్నారు. సీతానగరం ఆ ఊరికి చాలా దగ్గర. కాబట్టి ఆయన ఈ ఆశ్రమానికి వెళ్ళి వస్తారు. ఫోటోలు తీస్తారు. ఎంత లేదన్నా గురువారానికల్లా మనం ఫోటోలు చూడచ్చు.

ఈ టపా చదివిన వారందరూ రాజమండ్రికి చెందిన లేదా రాజమండ్రి చూడడానికి వెళ్ళాలనుకుంటున్న స్నేహితులతో ఈ ఆశ్రమాన్ని గురించి చెప్పండి. ముఖ్యంగా చదువుకుంటున్న పిల్లలుండే తల్లితండ్రులు వారిని తీసుకెళ్ళాల్సిన ప్రదేశం. పిల్లల్లో స్వాతంత్ర్యం పట్ల గౌరవాన్ని కలిగించినవారవుతారు. ఓ మంచి స్ఫూర్తినిచ్చిన వారౌతారు.

This is Ashram’s address: Kasturba Gandhi National Memorial Trust, Andhra Branch, Seethanagaram – 533 287 Via Rajahmundry, East Godavari Dt., Andhrapradesh, India.

Ph: 0883-2458802, 2458415.

వార్ధా జ్ఞాపకాలు – అనుభూతులు

 Please go through the following URLs:

 

http://simplethots.com/index.php?option=com_content&view=article&id=276:i-met-gandhi-at-wardha-he-is-a-social-worker&catid=25:the-project&Itemid=54

 

http://picasaweb.google.com/tapana2008/WardhaTripAugust2008#

You can see the mail thread in the following URL for the thoughts of some of the members who visited Wardha:

http://groups.google.co.in/group/birdsofsamefeathers/browse_thread/thread/f9806c9ae15eb2e9/510263a2caded143?lnk=gst&q=Wardha+trip#510263a2caded143

Reviving Bapu Ghat

Note: This is actually a summary e-mail that I circulated to the group. As I can’t write all these things in Telugu, I thought of sharing this mail in the blog.

Interested persons who are in Hyderabad can attend the meeting on 2nd November, 10 am to 12 noon at the following venue:

VMRG International – Media Centre
#  802 (6-3-596/23/1/1),
Venkata Ramana Colony,
Khairatabad, Hyderabad – 500 004 – AP
Phones: (040) 23326620, 65572593
Fax: 040-23326620
Mobile : 98499 70455
Email: vmrgsuresh@gmail.com
Visit us at www.vmrgmedia.com
The place is close to Rd No:1, Banjara hills as well as Khairatabad X Roads.

Reviving Bapu Ghat: A summary of our efforts, agreements and future plan of action

The volunteers who are in this mailing list are interested mainly in reviving Bapu Ghat.

Why?

 • To put the land (68 acres) to good use
 • To keep the Bapu Ghat as an icon and a platform to unite all people working on/influenced by Gandhiji’s principles
 • To let the new generation in AP know about Gandhji in detail and also about other leaders who followed Gandhiji’s footsteps

What is revival?

Revival means to keep the Ghat vibrant with regular activities

 • To do Organic Farming
 • To set up rain water harvesting and also a water bed for getting water for farming
 • To set up Go Ras Bhandar means to run a Go Shala (Shelter for Cows)
 • To construct model/ideal huts in line with Gandhiji’s principles and give them for people who want to do research on Gandhiji and for outstation dignitaries who come here to share their knowledge
 • To collect all the books, audios and videos related to Gandhiji, published so far.
 • To set up a museum
 • To set up a full-fledged office for documentation purpose (Computers with NET connection, Printer/Scanner/Xerox, Camera, Stationary, Projector, Mikes etc.,)
 • To produce/manufacture Swadeshi goods, if possible

Following are the agreed upon actions:

 • Submit a proposal to Govt. about our interests
 • Collect the information of all Gandhi Ashrams in AP

Roles and Responsibilities:

1. Dr. Vasanth Bawa and Purnachandar Rao – Advisors – Introduce all the resource persons to the team and guide us in our activities

2. GVVSDS Prasad – Advisor – Help us in getting support from Sevagram/Paunar and also give us the details and info. of all Gandhi Ashrams in AP

3. Suresh Adina, Sriram Rahi, Dr. Giri – Executive Members – Interested in Organic Farming, Go Ras Bhandar, Swadeshi Goods

4. Prasanthi, Amarnath – Volunteers – Getting in touch with Gandhi Ashrams in AP and co-ordination, whenever required

5. Kirti Chhaya, VMRG Suresh – Volunteers – Documentation work, compilation of information etc.,

Immediate action plans:

1. To get a list of all the resources who will be helpful for us in framing the proposal

— Dr. Vasant Bawa and Sri Purnachandar Rao should send a mail to us introducing the resources and also specify the reasons on why those resources are useful to us and in which context.

— Suresh Adina and Sriram Rahi should invite them for the meeting.

2. Prepare a rough draft/an outline on what should go into the proposal and in which fashion (format, structure etc.,)

— Everyone should list their views and come up with their thoughts on the structure of the document. We can collect all those docs and discuss in the meeting to finalize one.

3. Invite all the resources and volunteers for a meeting on 2nd of November from 10 am to 12 noon

— Prasanthi should collect the details of all the resources and should send an invitation mail to all of them (Volunteers and Resource Persons)

4. Should decide if a Board is necessary to take this up or submit a proposal.

(My personal opinion in this regard is to take this activity under the name of HSHT so that there will not be any controversy).

5. Though it is not required urgently for the meeting on 2nd November, we should keep ready the details of all the Ashrams in AP.

— Sri Prasad should faciliate the communication between Prasanthi and other Ashrams. (As of now, Prasanthi has the contact details of Pinakini Ashram, Nellore and Gautami Satyagraha Ashram, Seetanagaram)

 

Efforts so far:

1. With a series of meetings, we agreed to take this project and all of us are interested.

2. We were successful to be on the same page with respect to what we should do.

3. We created a channel for communication, a google group: http://groups.google.co.in/group/gandhi-n-development

From 3rd of November, we will be discussing only through the Google group that we created for this purpose.

 

 

గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమం, సీతానగరం, రాజమండ్రి

దీనిని గురించి నాకు ప్రసాద్ గారు చెప్పారు. ఒక ఆశ్రమం ఉంది. అక్కడ ట్రైనింగ్ క్లాసులు జరిపాము అన్నారు. జరిగినప్పుడు పిలిచారు కానీ వెళ్ళడం కుదరలేదు. మొన్న ఆదివారం మా టి మాడ్ సభ్యుడు కార్తీక్ పెళ్ళి రాజమండ్రిలో జరిగింది. అప్పుడు మేము సీతానగరం లోని ఈ ఆశ్రమాన్ని సందర్శించాము. అది ఒక వర్ణించలేని అనుభూతి. అక్కడి నుంచి రావాలనిపించలేదు. ప్రతి ఒక్కరూ ఒక్కసారైనా ఆ ఆశ్రమాన్ని చూసి రావాలి. నేను కేమెరా తీసుకువెళ్ళని కారణంగా ఫోటోలు తీయలేకపోయాను. ఎంతో బాధపడుతున్నాను. (అతి త్వరలో అవి కూడా రాగలవు. సుధాకర్ గారికి చెప్పాను. వాళ్ళ బంధువులు రాజమండ్రిలో ఉన్నారు. వారు ఈ ఆదివారం వెళ్ళి ఫోటోలు తీసి మనకు పంపుతారు).

నేను, రతన్ గారు, సత్యకృష్ణ వెళ్ళాము. సీతానగరం సుమారు ఒక యాభై కిలోమీటర్లు ఉంటుంది రాజమండ్రికి. ఆ దారి అంతా ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది. చూట్టూ పచ్చటి పంట పొలాలు. రోడ్డుకిరువైపులా చెట్లు. ఆశ్రమం రోడ్డు కి ఆనుకొనే ఉంటుంది. 28 ఎకరాలలో ఉంది. ముందంతా పొలం ఉంటుంది. గాంధీ గారు, కస్తూర్బా గారు ఈ ఆశ్రమానికి మూడు సార్లు వచ్చారు. గాంధీ గారు నాటిన చెట్టు కూడా ఉంది.

దీనికి ఎంతో ఘన చరిత్ర ఉంది. స్వాతంత్ర్యోద్యమ కాలంలో క్రియాశీల పాత్ర పోషించింది ఈ ఆశ్రమం. దీనిని స్థాపించిన వారు
బ్రహ్మజోస్యుల సుబ్రహ్మణ్యం గారు. ఈయన ఆర్. ఎం. పి. డాక్టరు. ఒకసారి ఈయన మార్గమధ్యంలోనే ప్రసవించిన ఒక స్త్రీని చూసి చలించి ఇక్కడి వారికి ఆసుపత్రి ఆవస్యకత ఎంతో ఉంది అని దీనిని స్థాపించారు. తర్వాత సత్యాగ్రహానికి సంబంధించి వివరాలు అందరికీ తెలియచేయడానికి ప్రింటింగ్ ప్రెస్ ని నడిపారు. బ్రిటీషు వారికి నీళ్ళు అంటే భయమట. అందుకే గోదావరిని దాటి ఈ ఆశ్రమానికి రావడం వారికి కష్టమని ఇక్కడ ప్రెస్ నడిపారు. అప్పట్లో ఈ ఆశ్రమానికి గోదవరి నది మీదుగానే రావాలి. ఇప్పటికి లాంప్ పోస్ట్ (దీప స్థంభం) ఉంది. దీనికి లాంతరులు వేలాడదీసేవారట. 90 ల వరకు కూడా ఇక్కడ ఆసుపత్రి బాగా నడిచింది.

ప్రస్తుతం దీనిని ఆపదలో ఉండే ఆడ వారికి తాత్కాలిక నివాస గృహంగా ఉపయోగిస్తున్నారు. 3 నెలల నుంచి 3 సంవత్సరాల వరకు ఉండచ్హు. 30 మంది వరకు నివాసం కల్పిస్తారు. వారికి కుట్టు, అల్లికలు, కొబ్బరి పీచుతో వస్తువులు చేయడం లాంటివి నేర్పిస్తారు. అలాగే జీవితం పట్ల సరైన అవగాహన కల్పిస్తారు. ఎలాంటి బాధలలో ఇక్కడికొచ్చిన వారైనా ఇక్కడి నుంచి వెళ్ళే సమయానికి తమ మీద నమ్మకంతో, జీవితంపై ఆశతో ఉంటారు.

ఇక్కడ అంగన్ వాడీ కార్యక్రమాలు కూడా జరుగుతాయి. ఈ ఆశ్రమం కె. గి. ఎన్. ఎం ట్రస్ట్, ఇందోర్ వారి ఆధ్వర్యంలో నడుపబడుతోంది. కస్తూర్బా గాంధీ నేషనల్ మెమోరియల్ ట్రస్ట్.  మొదటిసారి హరిజనుల ఆలయ ప్రవేశం కోసం ఈ ప్రాంతానికి వచ్చారు బాపూజీ. ఆ తరువాత రెండు సార్లు వచ్చారు. అప్పటికప్పుడు వారి కోసం గృహం నిర్మించారు. ప్రస్తుతం అందులో గాంధీ గారి చర్ఖా, ఈ ఆశ్రమం కోసం పాటు పడిన వారి వివరాలు, ఫోటోలు, అలాగే ఈ ఆశ్రమాన్ని ప్రముఖులు సందర్శించినప్పటి ఫోటోలు ఉన్నాయి. ఇక్కడి నుంచి కాకినాడ దగ్గరలోని పల్లె వరకు నెహ్రూ గారు మరికొందరు కాలి నడకన వెళ్ళారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో. గాంధీ గారి జీవితంలోని ముఖ్యఘట్టాల ఛాయాచిత్ర ప్రదర్శన కూడా ఉంది.

ఇక్కడ ఎందరో స్వాతంత్ర సమరయోధులు ఉన్నారు. వారిలో సూర్యకుమారి గారు ఒకరు. ఆవిడ తల్లిదండ్రులు ఇద్దరూ చనిపోతే మరో కుటుంబం వారు పెంచి పెద్దచేసారు. మరో స్వాతంత్రసమరయోధుల కుటుంబమైన మహీధర ఇంటి వారికిచ్చి వివాహం చేసారు. ఆమె అమెరికాలో ఉండేవారు. తర్వాత ఇక్కడి ఆశ్రమ పరిస్థితి చూసి, తను ఇక్కడికి వచ్చి ఇక్కడే ఉండడం మొదలు పెట్టారు. అమెరికాలోని తన మిత్రుల సహాయంతో నిధులు తెప్పించి గదులను కట్టించారు. అప్పటి కలెక్టరు ఈవిడ నిబధ్ధతకు (రేకుల గదిలో ఉంటూ ఈ ఆశ్రమం కోసం కృషి చేయడం) ఉత్తేజితులై, జన్మభూమి కింద కొన్ని నిధులు మంజూరు చేసి కొన్ని కార్యక్రమాలు జరిపారు. ఆవిడ కాలం చేసారు.

ప్రస్తుతం ఈ ఆశ్రమాన్ని సుశీల గారు పర్యవేక్షిస్తున్నారు. మేము ఆదివారం వెళ్ళాము. ఆవిడ ఏదో కాంప్ కి వెళ్ళారు. మేరీ అనే ఆవిడ మాకు ఆశ్రమం గురించి వివరించారు. నేను ఇంత బాగా వ్రాయగలిగానంటే ఆవిడ విపులంగా చెప్పడమే కారణం. ఏదో ఓ గంట చూసి పోదాము అనుకున్న మమ్మల్ని, మూడు గంటల పాటు ఆశ్రమంతా తిప్పి వివరించారు. ఆవిడ అంగన్ వాడీ కార్యకర్త. ప్రస్తుతం తాత్కాలిక బాలికల వసతి గృహాన్ని పర్యవేక్షిస్తున్నారు.

ఇక్కడ మనం ఏ కొంచెం డబ్బు ఇచ్చినా రసీదు ఇస్తారు. ప్రతిదీ గాంధీ గారి సిధ్ధాంతాలకణుగుణంగా నడుస్తుంది. అక్కడ ఉండే ఆడవారు ఖాదీ వస్త్రాలే ధరిస్తారు. అది కూడా ఎన్నో సంవత్సరాల నుంచి పని చేస్తున్న ఖాదీ భాండార్ ల నుంచి తెప్పిస్తారు. ఉదయం 4:30 గంటలనుంచి ఇక్కడ కార్యక్రమాలు మొదలవుతాయి. అందరూ 4 గంటలకే లేవాలి. ప్రతిదీ పధ్ధతి ప్రకారం జరుగుతుంది. ఎవరి పని వారే చేసుకుంటారు. ఆశ్రమం పనులు అందరూ సమిష్టిగా చేస్తారు. ఎవరెవరు పని చేస్తున్నారు, ఎవరికెంత జీతం ఇస్తారు, దేనికెంత ఖర్చు అయింది అన్నది గోడల మీద పెయింట్ చేసి ఉంటుంది.

వారి జీతాలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. అంత తక్కువ జీతాలకి వారు పని చేస్తున్నారంటే వారి నిబధ్ధతకు జోహార్లు అర్పించాలి. అయితే మేరీని చూస్తే గాంధీ గారి ఆశ్రమం అంటే ఏమిటో అర్థం అవుతుంది. ఆవిడ మాకు అంత ఇదిగా వివరించాల్సిన అవసరం లేదు. ఆదివారం మధ్యాహ్నం మేము వెళ్తే, ఆ రోజు తనకి శెలవైనా ఆమె మాకు వివరించింది. ప్రేమగా బాధ్యత నిర్వర్తించడం అంటే ఏమిటో మనం ఆమెలో చూడచ్చు. అక్కడ అన్ని మతాలకు చెందిన పండుగలు జరుపుతారు. ఉదయప్రార్ధనలో ఆశ్రమ సభ్యులందరూ పాల్గొనాలి వారు ఏ మతానికి చెందిన వారైనా సరే.

ఆశ్రమానికి ప్రస్తుత అవసరం కంప్యూటర్లు. అలాగే అక్కడి ఆడవారికి రగ్గులు. నేను ఇంతకు మించి కనుక్కోలేదు. ముందు ఇవి అందచేయగలిగితే తర్వాత మిగతావి చూద్దాము అని. ఇది ఆశ్రమం టెలిఫోన్ నంబరు: 0883-2458415. గోదావరి ప్రాంతానికి చెందిన వారు మీ స్నేహితులకి, బంధువులకి ఈ ఆశ్రమాన్ని గురించి చెప్పండి. వీలైనంత తొందరగా సందర్శించమని చెప్పండి. ప్రతి ఒక్కరూ ఎంతో ఆనందించగలరు. ఇక అక్కడి నుంచి వెనక్కి రావాలనిపించదు. అంత బాగుంటుంది ఆశ్రమ వాతావరణం.

నేను భూమిక మేగజైన్ సత్యవతి గారికి కూడా మెసేజ్ ఇచ్చాను. ఆవిడకు తెలుసో, లేదొ నాకు తెలియదు. కాకపోతే భూమిక ఆడవారికి సంబంధించిన పత్రిక కాబట్టి, అక్కడ ఆడవారికి ఆశ్రయం కల్పించబడుతోంది కాబట్టి ఈ ఆశ్రమం గురించి భూమిక వెలుగులోకి తెస్తే బాగుంటుంది అనిపించి చెప్పాను.మరీ ముఖ్యంగా ఆవిడ గోదావరి ప్రాంతానికి చెందిన వారు కూడా కనుక ఆవిడ దీనిని సందర్శించడం మరింత ఉపయుక్తంగా ఉంటుంది అని చెప్పాను.

అంత్రజాలంలో వెతికినప్పుడు ఈ క్రింది సమాచారం దొరికింది.

Source: http://209.85.175.104/search?q=cache:d6ogv0WDHUAJ:groups.google.tl/group/telugu-unicode/tree/browse_frm/month/2000-11/66865aab5a19068d%3Frnum%3D21%26lnk%3Dnl+Goutami+Satyagraha+Asram&hl=en&ct=clnk&cd=1&gl=in

Gautami Satyagraha Ashram on the banks of Godavari river played revolutionary role during freedom struggle. Mr C V Rajagopalarao former editor of Andhra Patrika published a book on the history and role of the Seethanagaram ashram.
The naRRAtion of ashram history is journalistic with lot of information.
Gautami Ashram was started at the initiation of one Aluminium merchant migrated from north India. His name was Jivan lal Seth. he gave plenty of money not only to start the ashram but to maintain it. It is a laudable offer during laTE 20 IN THE LAST CENTURY. The ashram was started in 1925 feb 4 by Brahmajosyula Subrahmanyam. 25 other satyagrahis participated in the activities. their brief bio data was given in this book. The author took lot of trouble in collecting the material. even then he could not approach British Museum in London or Library of Congress where some rare material is available.
Kovidi Lingaraju played important role in the ;movement. The author revealed that Lingaraju has taken down notes from Tanguturi ;Prakasam about his autobiography but censored much information from the public. That is a sad fact about Prakasam`s life. Chundrupatla Hanumantha rao father of the author also had key role in the ashram. many detaials were given in this book about him. the role of Congress weekly is highlighted especially about Madduri Annapurnaiah the founder editor.,
One has to lament that not even a single copy of Congress is available to the public till today. perhaphs some research ;;may help. Gandhiji visited this ashram in ;1929. Britisher police closed this ashram in 1932. This book published in Telugu during April 2000 is being sold at visalandhra publicatons in AP. price Rs 10o. no $ price. INNAIAH NARISETTI.

బాపూజీతో పరిచయం

గాంధీగారిని ఇష్టపడని చిన్న పిల్లలు ఎవరుంటారు? నేను కూడా అంతే. ఆయన జీవిత చరిత్ర నాలో నిజాయితీ పట్ల నమ్మకాన్ని పెంచింది. అబధ్ధాలు ఆడకుండా ఉండేందుకు స్ఫూర్తినిచ్చింది. సామాన్యంగా జీవించడంలోని అందాన్ని, ఆనందాన్ని వివరించింది. అయితే నేనెప్పుడు గాంధీ గారికి సంబంధించిన పనుల్లో పాలుపంచుకుంటానని కానీ, అలాంటి వ్యక్తులను కలుసుకుంటానని కానీ అనుకోలేదు. నా జీవితంలోకి గాంధీ గారు చాలా విచిత్రంగా ప్రవేశించారు. ఇందుకు డాక్టర్ వసంత్ బావా గారికి ప్రత్యేక కృతజ్ణ్జతలు తెలియచెప్పాలి.

మనం ఎందుకోసం ప్రయత్నించినా ఆ శ్రమ వృథా పోదు. అందుకోసం కాకపోతే వేరొకందుకు పనికొస్తుంది అని మరోసారి ఋజువైంది నా ఈ ప్రస్థానంలో. బత్తీ బంద్ అంశం మీద నేను డాక్టర్ వసంత్ బావా గారిని కలిసాను. పర్యావరణ కార్యకర్త అయిన ఉమేష్ నాకు వీరి వివరాలు ఇచ్చారు. డాక్టర్ బావా హైదరాబాదు తొలి వి.సి. గా పని చేసారు – 74 నుంచి 79 వరకు. వీరు వాతవరణ మార్పుల గురించి అధ్యయనం చేసే శాంతి ఫౌండేషన్ ని స్థాపించారు.

ఆయనని కలిసినప్పుడు మాటల మధ్యలో నేను నెల్లూరు కి చెందిన అమ్మాయినని చెప్పాను. అప్పుడు నెల్లూరికే చెందిన డాక్టర్ చక్రవర్తి గారి గురించి, నెల్లూరులోని గాంధీ ఆశ్రమము గురించి ఆయన నన్ను అడిగారు. గాంధీ గారి ఆశ్రమం ఒకటి ఉందనే నాకు తెలియనందుకు నేను చాలా సిగ్గుపడ్డాను. వెంటనే శ్రీ పెరుగు రామకృష్ణ గారికి, శ్రీ సుధాకర్ రెడ్డి గారికి ఫోన్ చేసి వివరాలు సేకరించాను. తర్వాత డాక్టర్ సుబ్రహ్మణ్యం గారు హైదరాబాదు వచ్చినప్పుడు ఆయనను డాక్టర్ బావా గారికి పరిచయం చేసాను.

(సుబ్రహ్మణ్యం గారు నెల్లూరు రెడ్ క్రాస్ సొసైటీకి కార్యదర్శిగా పని చేస్తున్నారు. నెల్లూరులోని పినాకినీ ఆశ్రమము ప్రస్తుతం రెడ్ క్రాస్ అధీనంలోకి వచ్చింది. సుబ్రహ్మణ్యం గారు చాలా నిబధ్ధత కలిగిన వారు. నెల్లూరు రెడ్ క్రాస్ వారు సాధించిన విజయాలలో ఆయన పాత్ర ఎంతో ఉంది. పినాకినీ ఆశ్రమానికి పూర్వవైభవం తీసుకురావడానికి కృషి చేస్తున్నారు).

ఆ సందర్భంగా డాక్టర్ బావా గారు నాకు లంగర్ హౌస్ లో ఉండే బాపూ ఘాట్ గురించి చెప్పారు. దానిని గాంధీ గారి సిద్ధాంతాలకి అణుగుణంగా నడపాలని వీరు చాలా కాలంగా కృషి చేస్తున్నారు. హం సబ్ హిందుస్తానీ ట్రస్ట్ వారితో కలిసి చర్చిస్తూ ఉంటారు. ఫోరం ఫర్ బెటర్ హైదరాబాద్ లాంటి సంస్థలతో పరిచయం ఉంది.

అప్పుడే ఆంధ్రప్రదేశ్ సర్వోదయ మండల్ డైరెక్టరు అయినటువంటి ప్రసాద్ గారి గురించి చెప్పడం జరిగింది. డాక్టర్ గిరి గారు (డాక్టర్ రామన్ ఫౌండేషన్ వ్యవస్థాపకులు), మా టిమాడ్ రవి, బావా గారితో కలిసి బాపూ ఘాట్ ని చూసి వచ్చారు. గిరి గారైతే ప్రసాద్ గారిని, సుబ్రహ్మణ్యం గారిని కూడా కలిసారు. ప్రసాద్ గారు సర్వోదయ పనుల మీద విద్యార్ధులకు గాంధీ సిధ్ధాంతాల మీద ట్రైనింగ్ క్లాసెస్ చెప్తూ ఉంటారు. వీరి శ్రీమతి గారు లవణం గారికి దగ్గరి బంధువులు. ప్రసాద్ గారు దేశం లో ఉన్న గాంధీ ఆశ్రమాలన్నిటి దగ్గరకి వెళ్తూ, వివిధ కార్యక్రమాలలో పాల్గొంటూ ఉంటారు. విదేశీ విశ్వవిద్యాలయాలలో ముఖ్యంగా శ్టాన్ ఫర్డ్ మరియు విస్కాన్సిన్ లో విజిటింగ్ ప్రొఫెసర్ గా ఉన్నారు.

ఈ విధంగా మా లో కొంతమంది వార్ధా కి వెళ్ళడం జరిగింది. బి. వొ. ఎస్. ఎఫ్. లోని కొన్ని గ్రూపుల సభ్యులు వెళ్ళి వచ్చి చాలా ఉత్తేజితులయ్యారు. వారు బాపూ ఘాట్ ని పునరుధ్ధరించి, ప్రగతిశీలంగా తయారు చేసే ప్రయత్నంలో పాలుపంచుకునేందుకు అంగీకరించారు.

ఆ దిశగా ఒక అంశం ఏమిటంటే మన రాష్ట్రంలో ఉండే గాంధీ ఆశ్రమాలన్నిటికీ బాపూ ఘాట్ ని కేంద్రంగా చేయడం, అలాగే ఎప్పటికప్పుడు సమాచారాన్ని, సహాయాన్ని ఇచ్చిపుచ్చుకోవడం. ఈ ప్రయత్నంలో భాగంగా నెల్లూరు వెళ్ళినప్పుడు పినాకినీ ఆశ్రమాన్ని (పల్లెపాడులో ఉంది), అలాగే గత ఆదివారం సీతానగరంలోని గౌతమీ సత్యాగ్రహ ఆశ్రమాన్ని సందర్శించడం జరిగింది.  ఒక్కొక్క ఆశ్రమం గురించి విపులంగా వేరే టపాలలో వ్రాస్తాను.

డాక్టర్ బావా గారు ’21 వ శతాబ్దంలో గాంధీ’ అనే ఓ పుస్తకానికి సంపాదకత్వం వహించారు. ఇది వార్ధాలో జరిగిన ఓ వర్క్ షాప్  లోని ప్రసంగాల సంకలనం. ఎంతో బాగుంది. అలాగే ప్రతి ఒక్కరూ మార్జొరీ స్కైస్ రాసినటువంటి వినోబా గారి ఆత్మకథ తప్పక చదవాలి.

ఈ టపా ముఖ్యోద్దేశ్యం ఏమిటంటే గాంధీ గారి సిద్ధాంతాల పట్ల నమ్మకం ఉండే వారికి ఈ ప్రయత్నం గురించి తెలియచెప్పడం. అలాగే ఆయా ప్రాంతాలకి చెందిన వారు ఆయా ఆశ్రమాల గురించి అందరికీ తెలియచేస్తూ వారికి ధన, వస్తు, కంప్యూటర్ పరిజ్ఞాన రూపేణా సహాయసహకారాలు అందచేస్తారనే ఆశ, చేయాలని విజ్ఞప్తి.

What would we do in Wardha?

1. Sevagram Ashram: Bapu Kuti (where Mahatma Gandhi lived for about a decade), other structures in the Ashram which are historic. Gandhi Exhibition – information on Gandhi’s life and message. Nai Talim School – Basic Education concept based school. Participation in Prayer Meeting. Meeting several ashramites, discussions with some of the experienced people in Gandhian movement. Book Stall, Khadi and Village industries stalls (people can purchase literature and articles), Organic farming in the Ashram, Goshala – cow based agriculture.

2. Magan Sangrahalaya: A centre of rural industries exhibition, Khadi production, natural dyes, place where J.C. Kumarappa lived (famous Gandhian Economist who developed rural industries). This was established and developed by Devendrakumar Gupta who was a Vice Chancellor of Gandhigram Rural University. His wife, Prabha Gupta lived in Pinakini Satyagraha Ashram for some time and is closely associated with Nellore.

3. Centre of Science for Villages: A place where rural technologies were developed and used – hand made paper, biogas technology, Medicinal plants, Pottery, Nonviolent-Honey, low cost irrigation systems etc.

4. Housing Technology Centre: low cost housing technology, sanitation technology, drinking water and other technologies

5. Pavnar Ashram: This is where Acharya Vinoba Bhave lived and worked. Presently there is a goshala, publication centre and other activities.

6. Gopuri: Centre for rural industries – Khadi, Oil Ghani, production of Charkhas – both Ambar Charkha and Peti Charkha. Bajaj Exhibition

7. Gosamvardhan Goras Bhandar: An enterprise based on cow running for over 70 years which brings value addition to the farmers and consumers. They have high quality dairy products providing Rs.17 per litre of cow milk to the farmers and supplying to consumers at Rs.20 per litre. Perhaps no dairy unit in the country runs on such low margins for the administration and profits.

8. Viswa Santhi Stupa: A Monmument depicting the importance of peace and nonviolence. A buddhist shrine.

9. Gitai Mandir: Another important tourist place in Wardha.

There are other places that can be included depending on time availability. The important aspect of this visit should be to spend more time on understanding the Gandhian concept of Truth & Nonviolence and how a society based on these principles can be built. We will have more time to internalise, reflect and discuss Gandhian perspectives and how they can be helpful to our work.

Should you need any further information please let me know.