గాంధీజీతో ఓ రెండు రోజులు

ఇదేమి శీర్షిక అనుకుంటున్నారా? అవునండి మీ అందరి చేత చదివించాలంటే ఇలాంటి శీర్షికే కావాలి.

విషయానికి వస్తే ఒకే గూటి పక్షులందరూ గత ఆగష్టులో వార్ధా వెళ్ళి వచ్చారు. నేను సైనస్ ప్రకోపించడం వల్ల వెళ్ళలేకపోయాను.

ఈ సారి రెట్టించిన ఉత్సాహంతో ఉగాది రోజున గాంధీ గారిని కలవడానికి వెళ్తున్నాము. అవును మరి, ఆయన నివసించి, సంచరించిన చోటు, సమావేశ మందిరం ఇత్యాది వాటిని చూడడం అంటే ఆయన్ని కలిసినట్టే కదా.

మరి వెళ్ళే వాళ్ళం వెళ్ళక బ్లాగడం దేనికి అనుకుంటున్నారా? భలేవారండీ. మీ అందరినీ తీసుకు వెళ్ళకుండా ఎలా వెళ్ళగలం 🙂 అందుకే ముందుగా మీ అందరికీ తెలియపరిచి, ఉత్సాహం ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర అంగీకారం తీసుకుంటే టికెట్స్ బుక్ చేసుకోవాలి కదా. అందరం కలిసి వివిధ విషయాల గురించి చర్చించుకుంటూ వెళ్తే అది ఎంతో విజ్ణ్జానదాయకంగా ఉంటుంది మరియు ఒక చారిత్రక ప్రదేశాన్ని చూసినట్టు ఉంటుంది. చదువుకునే పిల్లలు ఉన్న వారైతే పిల్లలకి ఇలాంటివి చూపించడం ఎంతో బాగుంటుంది.

ఉగాది ముందు నిజాముద్దీన్ ఎక్స్ ప్రెస్ లో బయలుదేరి పక్కరోజు ఉదయం వార్ధా చేరుకుంటాము.  సేవాగ్రం లో అన్నీ చూసాక, పౌనర్ ఆశ్రమానికి వెళ్తాము. అక్కడి నుంచి వరోరా వెళ్తాము. బాబా ఆంటే గారు సేవ చేసిన ఆనందవనమే వరోరా.

ఈ ప్రయాణం ఎంత ఆనందంగా, ఆహ్లాదంగా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ కింది లంకెలు చూడండి.

1.
http://simplethots.com/index.php?
option=com_content&view=article&id=2…

2. http://picasaweb.google.com/tapana2008/WardhaTripAugust2008#

3. http://picasaweb.google.com/asuresh18/NagpurSevagramRamesh#

4.
http://in.youtube.com/watch?v=c0uOQkJCJa0&feature=related

మీకు కూడా రావాలని ఉంది కదా. మరింకెందుకాలస్యం? మీ వివరాలు నాకు గురువారం (8 వ తేదీ) లోపల మెయిల్ చేయండి. కుదురుతుందో, లేదో అనుకుంటున్నారా? ఉగాది శుక్రవారం, శని, ఆది వారాంతం, ఇంకేమి కావాలి? ఇప్పుడు బుక్ చేసుకుంటే, అంతగా రాలేకపోతే రెండు రోజుల ముందు కేన్సిల్ చేసుకున్నా నష్టం ఉండదు.

The person who is responsible for the Wardha Ashram, Shri Jamnalal Bajaj:

http://wardha.nic.in/htmldocs/jbmain.asp

About Paunar:

http://gm.4mg.com/AboutWardha/pavnar_a.htm

http://www.maharashtra.gov.in/english/gazetteer/WARDHA/places_Pavnar.html

About Vinoba ji:

http://www.mkgandhi.org/associates/Vinoba.htm

ఇంతకీ మీరందరూ వస్తే నాకేంటి లాభం అనుకుంటున్నారా? ఉందండి. ఒకే గూటి పక్షులందరినీ ఒక దగ్గర సమావేశపరిచి, ఆలోచనలు, అభిప్రాయాలు పంచుకునే ఆనందం నేను పొందే లాభం.

ప్రకటనలు