దోర్…..

చాలా హృద్యమైన సినిమా, చాలా సహజంగా ఉంది. ఆలోచించే కొద్దీ ఎన్నో కోణాలున్నాయి.

బతుకుతెరువు కోసం దూర తీరాలకు వెళ్ళాల్సి రావడం, భార్యాభర్తలు, తల్లీ బిడ్డలు దూరమవక తప్పని పరిస్థితి, లేదా అలాంటి పరిస్థితిని కోరి కొని తెచ్చుకున్న సమాజం.

సాధించాలనే ఆశయం, ఆత్మ విశ్వాసం ఉంటే ఏదైనా సాధ్యమే. ఎంత పెద్ద పనైనా చేయగలమనే నమ్మకం, చేయాలనే బలమైన ఆశయం ఉంటేనే సాధ్యమౌతుంది.

దేశంలోని ఏ రాష్ట్రంలోనైనా స్త్రీల జీవితాలు ఎలా ఉంటాయి, వారి హక్కుల కోసం, కనీస స్వేచ్ఛ కోసం వారు ఎంతగా పోరాడాలి.

ఎంత దు@ఖం కమ్మేసిన జీవితమైనా చిన్న చిన్న ఆనందాలను ఎలా ఆస్వాదిస్తుంది. జీవితం విలువ ఏమిటి.

హిమ్మత్ – ధైర్యం, హోస్లా.. ఇది ఆత్మవిశ్వాసం తో కూడిన ధైర్యం కావచ్చు ఉండటం ఎంత అవసరం. ఎలాంటి నిరాశాజనక పరిస్థితుల్లో అయినా ఓ కార్యసాధకునికి మార్గం ఎలా దొరుకుతుంది….. ఊహించని వ్యక్తుల నుంచి సాయం ఎలా అందుతుంది…. దొంగతనం చేసేవాళ్ళు, మాయమాటలతో మోసం చేసేవాళ్ళలో కూడా మానవత్వం ఎలా నిబిడీకృతమై ఉంటుంది…..

హకీకత్…… ఈ పదం ఎంతో విలువైన పదం, ఆంగ్లంలో అయితే ఫాక్ట్ కావచ్చు దీని అర్థం. తెలుగులో సరైన పదం గుర్తురావడం లేదు. మన చేతిలో లేని కారణాల వల్ల జీవితాలకు జీవితాలే ఎలా తారుమారవుతాయి.

స్త్రీ, పురుషుల మధ్య శారీరిక మోజు లేని, నిష్కల్మషమైన అభిమానం, ప్రేమ ఉండచ్చు అని…….

ఇలా ఒకటేమిటి…… చాలా చాలా ఉన్నాయి ఈ సినిమాలో అర్థం చేసుకోదగినవి.

క్లుప్తంగా ఇది ఇద్దరి ఆడవారి కథ. హిమాచల్ ప్రదేస్ లో జీనత్ అనే ఆత్మవిశ్వాసం, ధైర్యం కల అమ్మాయి ఉంటుంది. ఆమె, ఆఅమిర్ అనే అతను రెండేళ్ళుగా ప్రేమించుకుంటూ ఉంటారు. ఆమిర్ తల్లిదండ్రుల అనుమతి కోసం వేచిచూస్తుంటారు. ఉద్యోగం కోసం దుబాయి వెళ్ళాలని నిర్ణయించుకుని జీనత్ ని పెళ్ళి చేసుకుని దుబాయి వెళ్ళిపోతాడు. జీనత్ క్రమంగా అత్తమామల ప్రేమని పొందుతుంది. వారికి చేదొడు, వాదోడుగా ఉంటుంది.

రాజస్థాన్ లో మీరా, శంకర్ భార్యాభర్తలు, అగ్నివంశీయులు. ఆచారవ్యవహారాలలో శ్రోత్రియంగా ఉంటారు. అత్తగారి అత్తగారు, అత్తగారు, మామగారు, భార్యా, భర్త, వాళ్ళు పెంచే ఓ కూతురు ఉంటారు. వాళ్ళ భవనం (హవేలీ) అప్పుల్లో ఉన్న కారణంగా శంకర్ దుబాయి వెళ్తాడు.

శంకర్, ఆమిర్ ఒకే రూములో స్నేహంగా ఉంటారు. ఎవరూ లేని సమయంలో వారిద్దరి మధ్య ఎందుకో వివాదం జరిగి అనుకోకుండా పై నుంచి కిందపడడం వల్ల శంకర్ చనిపోతాడు. శంకర్ చావుకి కారణమైనందున ఆమిర్ కు ఉరిశిక్ష పడుతుంది. దుబాయి చట్టాల ప్రకారం  మృతుని భార్య క్షమిస్తే దోషికి ఉరిశిక్ష రద్దవుతుంది.

ఆమిర్, శంకర్ కలిసి తీయించుకున్న ఫోటో తప్ప ఇక ఏ వివరాలు జీనత్ దగ్గర ఉండవు. అతని ఊరు రాజస్థాన్ అని తప్ప ఇంకేమీ తెలియదు. అయినా అలాగే బయలుదేరుతుంది. ఓ సిఖు సాయంతో రాజస్థాన్ వరకు వెళ్తుంది. అక్కడ ఓ దొంగ తన సంచీ, సామాను దొంగలిస్తాడు. ఒంటరిగా ఉన్న ఈమెను బలాత్కరించడానికి ప్రయత్నించబోతే, ఆమె సామానులు దొంగిలించిన అతను పోలీసు వేషంలో వచ్చి రక్షిస్తాడు. ఇతను రకరకాల వేషాలతో ప్రజలను మోసగిస్తూ తన పబ్బం గడుపుకుంటూ ఉంటాడు. ఈ అమ్మాయి గురించి తెలుసుకుని తనకి సాయపడతాడు. మొత్తానికి జోధ్పూర్ దగ్గర సరోహా అనే పట్టణం అని తెలుసుకుని వారి ఇంటికి వెళ్తారు. మీరాని కలుసుకోక ముందే… శంకర్ అమ్మ, నాన్న, తమ్ముడు ఆమెను వెళ్ళగొడ్తారు.

ఎలాగైనా మీరాని కలిసి ఆమే చేత సంతకం పెట్టించుకోవాలని జీనత్ అనుకుంటుంది. మీరా చాలా చలాకి అయిన పిల్ల కాకపోతే భర్త పోయిన తర్వాత తన ఇష్టాలన్నిటినీ చంపుకుని జీవచ్ఛవంలా బతుకుతూ ఉంటుంది. చిన్న చిన్న ఆనందాలు పొందేందుకు కూడా తనకు అర్హత లేదు అనుకుంటుంది. అలాంటి ఆలోచనలు రావడమే తప్పు అని భావిస్తుంటుంది.

గుడికి వెళ్ళడం కోసం మాత్రం తను బయటకి వస్తుందని తెలుసుకుని తన భర్తని వెతికేందుకు మీరా సహాయాన్ని అర్థిస్తుంది జీనత్. మొదటే విషయం చెప్తే శంకర్ తల్లిదండ్రుల లాగే మీరా కూడా ఎక్కడ నిరాకరిస్తుందో అని భయపడుతుంది. క్రమంగా వారి మధ్య స్నేహం చిగురిస్తుంది. జీనత్ సహచర్యంలో తన జీవితాన్ని తన ఇష్టం వచ్చినట్టు గడిపే హక్కు తనకు ఉందని, తన హక్కులను తనే సాధించుకోవాలని మీరా తెలుసుకుంటుంది. ఇంతలో ఉరిశిక్ష తేదీ ప్రకటించబడుతుంది. మీరాకి విషయం చెప్తే కోపంగా సంతకం పెట్టడానికి నిరాకరిస్తుంది. మీరా, జీనత్ తో స్నేహం చేస్తోందని తెలిసిన శంకర్ తల్లిదండ్రులు మీరాని బంధిస్తారు. నిరాశతో జీనత్ తిరిగి వెళ్తూ మీరకి ఉత్తరం రాసి వెళ్తుంది. అమ్మమ్మ (అత్తగారి అత్తగారు) సలహాతో, సాయంతో మీరా బయటపడుతుంది. ఆమిర్ ని క్షమిస్తూ సంతకం పెడ్తుంది. జీనత్ తో కలిసి వెళ్తుంది తన ఊరి నుంచి, బందిఖానా లాంటి జీవితం నుంచి.

నటీనటుల నటన, దర్శకత్వ ప్రతిభ, సంగీతం, ప్రదేశాలు, డైలాగులు ఒకటేమిటి అన్నీ చాలా బాగున్నాయి. కొన్ని కొన్ని డైలాగులు హృదయానికి హత్తుకుండిపోతాయి.

దర్శకత్వం, కథ నాగేష్ కుకునూర్ వి. జీనత్ గా గుల్ పనాగ్, మీరా గా అయేషా టకియా, దొంగగా శ్రేయాస్ తల్పడే, శంకర్ నాన్న గా గిరీశ్ కర్నాడ్, ఓ ఫ్యాక్టరీ అధిపతి/అధికారిగా నాగేష్ కుకునూర్ నటన చాలా బాగుంది.

ఏ హోస్లా కైసే ఝుకే…….. ఏ ………. కైసే రుకే……..అనే పాట చాలా బాగుంటుంది. ఫిజా తర్వాత నాకు అంతగా నచ్చింది ఈ సినిమా.

ప్రకటనలు

Stand up against Terrorism

Let me share my thoughts, please let me know if you think they are not
workable/feasible.

First and foremost, every citizen in India might be feeling bad for the
recent happenings and the frequent killings. Everyone of us are willing to
do something but we do not have a clear idea on what we can do.

There should be a way to show that we all are united in these thoughts and
we are alike in our views. Then we can think of actions.

Actions:

1. Plan a Peace Walk with all NGOs, students on the New Year Day

Each group will take the responsibility of spreading the news about the Walk
and the message is: We will be United, We are Indians, We are against Terror
and We will not tolerate any kind of Terrorism. We pledge to bury the past
and to be determined to move towards a serene future and Most Importantly
……. WE WILL BE RESPONSIBLE CITIZENS, ACTIVE CITIZENS. Pledge that we do
not look at people of other religions with suspicion. Let us bring sense in
the people if we know that they are being influenced by extremists.
(Black n White, hindi movie, is the best example on how a Terrorist who
believes that he does things for Religion begin to understand the language
of love and changes..)

2. Collect the peace related statements from all Religions and distribute
those pamphlets

3. In every colony, form Peace Committees and plan good activities once in
every quarter or so. The job of these committees is to ensure the good will
and love for each other and also to do activities that develop and improve
the relations.

4. Let us meet and talk with all the people who have seen bloodshed and
record their emotions and how they were changed over the years.

5. Similarly publish about all the instances where different communities
live in friendship, trust n harmony.

6. Let us discuss with respective state govts., and get trained on how
we can co-operate at the times of crisis.

7. We should make a demand that whoever wants to wage war should first
participate in the war or send any of their family members to take
part in it. No problem if we do not know warfare and tactics, we can
be as armours to our skilled and precious soldiers.

8. Try to visit the borders and the places of significance and pay our
respects to our soldiers. Soldiers always feel that they did their job
and they are back to their disciplined and tiresome routine. We should
show them our respect, love and trust and give them confidence that we
are all there for them.


Thank you.
with regards,
PRASANTHI.
—-
When you want something, the whole universe conspires in helping you to achieve it.

మనోభావాలు

ఎక్కడ ఏ అలజడి జరిగినా గాయపడేవి మనోభావాలే. మనోభావాలు అంటే ఏమిటో, ఎలా ఉంటాయో చూపించండి నాకు అంటూ ఎవరో తెలుగుపీపుల్ వెబ్ సైటులో చాలా చక్కగా వ్రాసారు.

ముంబై మారణకాండలో, ఈ మధ్య తరచుగా భారతదేశంలో జరిగే ఉత్పాతాలలో దెబ్బతిన్నవి ఎవరి మనోభావాలు !! హిందువులువా, ముసల్మానులవా, క్రైస్తవులవా, పార్శీలవా, సిక్కులవా … ఎవరివి?

ఈ మధ్య ప్రతి ఒక్కరి మనోభావాలు తెగ స్పందిస్తున్నాయి, ముఖ్యంగా నిద్రించే, చేతగాని, చేవలేని, పట్టింపులేని మనవి, సాధారణ ప్రజలవి.

మనమెప్పుడూ సాధారణప్రజల కోవలోనే ఉండేందుకు సిద్ధపడతాము. అప్పుడు ఏ బాధ్యత అవసరం లేదు. ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు అంటూ నిందిస్తే సరిపోతుంది. ఆ పార్టీ చెత్తదా, ఈ పార్టీ వెధవాయా అని వ్యాఖ్యానాలు చేసుకుంటూ ఉంటే రోజు గడిచిపోతుంది.

ముంబైలో కమెండోలు వారి పని పూర్తయ్యాక బయటకొచ్చి వెళ్ళిపోతుంటే…… భారతమాతా కీ జై…… జై జవాన్ అని సాధారణ ప్రజలు అరిచారని చదివాక ….. భరతమాత, జవాన్లతో పాటు నా మనోభావాలు కూడా గాయపడ్డాయి.

పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతున్న యుధ్ధఖైదీలను విడిపించాలంటూ వారి కుటుంబాలు కాళ్ళరిగేలా ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతుంటే……. అప్పుడేమైంది జై జవాన్ నినాదం.

కార్గిల్ యుధ్ధమప్పుడు లెఫ్టినెంట్ సౌరభ్ కాలియా మరియు అతని సహచరులను అత్యంత కిరాతకంగా హింసించి చంపేసి, చిత్రహింసకు గురైన శవాలను నిస్సిగ్గుగా మనకి అప్పగిస్తే……. ప్రభుత్వం ఎలా స్పందించింది అని ఒక్కరైనా ప్రశ్నించామా !!

చైనా తో యుధ్ధం, పాకిస్తాన్ తో యుద్ధాలు….. జరిగిన రోజులను మనం స్మృతిపథంలో ఉంచుకోము. సినిమావాళ్ళ పెళ్ళిళ్ళు, పేరంటాలు అన్నీ వార్తలే.

ఇంచుమించు మన దేశంలోని ప్రతి రాష్ట్రంలోను తీవ్రవాదుల తూటాలకు మన జవానులు వీరమరణం పొందుతున్నారు. ఏనాడైనా వారికి శ్రధ్ధాంజలి ఘటించామా? అసలు వారికి పోరాడేందుకు సదుపాయాలు కల్పిస్తున్నామా?

జై జవాన్….. భారత్ మాతా కీ జై…… మనలాంటి సాధారణ ప్రజలందరికీ …… ఇలా నినదించేందుకు… హక్కు లేదు…..అర్హత లేదు…….

సైన్యానికి యువత అవసరం ఎంత ఉంది !! మనలో ఎంత మందిమి సైన్యంలో చేరుతున్నాము? మనం ఏమీ చేయము. అదేదో సినిమాలో చెప్పినట్టుగా…….. జెండా పండుగ రోజు జాతీయ గీతాలాపనతో మొలకెత్తే దేశభక్తి ఆ గీతంతోనే ముగుస్తుంది.

ముంబై లాంటి దుశ్చర్యలు జరిగినప్పుడల్లా అవివేకమైన ఆవేశంతో, అర్థం పర్థం లేని నినాదాలు చేస్తాము. పాకిస్తాన్ మీదకు యుద్ధానికి వెళ్ళాలని అంటాం. అవును మనకేమి పోయింది? పోయేవి సైనికుల ప్రాణాలు మాత్రమే కదా…

అందుకే మనకి యుధ్ధం కావాలి. సొల్లు వేసుకోవడానికి బోలేడు కబుర్లు ఉంటాయి అప్పుడు. పాకిస్తాన్ కాదు భారత దేశం శతృవు. మనం…. సాధారణ ప్రజానీకం.. శతృవులం.

ఓ పంది, ఓ గోవు, ఓ కాగితం, ఓ కట్టడం…..

కాదేదీ కలత కనర్హం….

ఒకరినొకరం చంపుకోవడమే ఆదర్శం.

డబ్బు కోసం మనమే ఉగ్రవాదులను రానిస్తాము, ఆశ్రయమిస్తాము, అన్నీ సమకూరుస్తాము. డబ్బు తప్ప ఏమీ పట్టని మన జీవితాలు ఉగ్రవాదుల తూటాలకు బలవ్వడమే భేషుగ్గా ఉంటుంది.

అవును…………. మనోభావాలు గాయపడ్డాయి…

మీవో, నావో కాదు……..

మానవత్వానివి !!!

జస్ట్ ఫర్ ఫన్ …….

సమాచార హక్కు చట్టం పై నా రాతలు ..

 

సమాచార హక్కు చట్టం – సామాన్యుని చుట్టం,

పారదర్శకతకు పట్టం

 

ప్రశ్నించేందుకు లేదు ఏ పరిమితి, భారత పౌరులైన ప్రతి ఒక్కరికీ అనుమతి

ప్రజలకి ఇదో చారిత్రాత్మక బహుమతి, ఉపయోగించుకోవడం మన విధి

 

==========================================
 

 

ఆ రాణీ ప్రేమ పురాణం, ఆ ఖర్చులకైన లెక్కలు

కాకపోయినా చరిత్ర సారం,

అడిగే హక్కు ఇప్పుడు మన సొంతం

ప్రజల డబ్బు, అబ్బ సొమ్ములా వాడితే

వసతి ఇక శ్రీకృష్ణ జన్మస్థానం

 

=======================================
 

 

 

అడగాలని ఉందా……. గొంతు విప్పాలని ఉందా……..

చినుకొస్తే చిత్తడయ్యే రాదారులు

పందికొక్కులతో నిండిన గోదాములు

ఎందుకిలా అని…………..

అడగాలని ఉందా……. గొంతు విప్పాలని ఉందా……..

 

మీ గ్రామానికి ……

రేషను కోటా, విద్యుత్ వాటా

చక్కని బాట, బస్సుల కాటా

మహిళలకి అంగన్ వాడీ, పిల్లలకి బడి

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,

రక్షిత తాగునీటి పథకం

వయోజనులకు పించను, యువకులకు పని

కల్పిస్తోందా ప్రభుత్వం, చేస్తోందా ప్రయత్నం

అని ………అడగాలని ఉందా……. గొంతు విప్పాలని ఉందా……..

 

సమాచార హక్కు చట్టం ఉపయోగించుకోండి.

పనులను చక్కబెట్టుకోండి.

రొక్కం చక్కబెట్టే వాళ్ళ పని పట్టండి.

నిజానిజాలు ప్రభుత్వ ముద్ర సాక్షిగా

ప్రజల ముందుకు తేండి.

=============================
 

 

సర్వతోముఖాభివృధ్ధి

ఎన్నాళ్ళమ్మా, ఎన్నేళ్ళమ్మా

అని పాటలు పాడుకుంటూ కాలం గడపద్దు

ప్రశ్నించేందుకు వెరవద్దు

 

కావాల్సిందో కాగితం, కలం

రాయాల్సింది కావల్సిన సమాచారం

పది రూపాయల రొక్కం,

సంబంధిత కార్యలయంలో సమర్పణ

దరఖాస్తు నఖలు

దాని మీద స్వీకార ముద్ర

 

ఎన్నాళ్ళో పట్టదు……… ఓ ముప్పై రోజులే…….

ఎన్నేళ్ళో అక్కరలేదు….. ఓ నాలుగు వారాలే

=================================
 

 

కుక్కపిల్ల, సబ్బుబిళ్ళ కాదేదీ కవిత కనర్హం

సమాచార హక్కు పరిథి అలాగే అనంతం

 

మీ ఇంటి గురించి, మీ వీధి గురించి,

మీ ఊరి గురించి

ఏదైనా…. అడగచ్చు, విజ్ణ్జతతో……సఖ్యతగా…..

సమాచారం ఓ ఆయుధం

యుద్ధం చేసేందుకు కాదు, సత్యం చాటేందుకు

ప్రభుత్వాధికారులు, ప్రజల సేవకులు 

కర్తవ్య నిర్వహణలో కళంకితంగా ఉండేందుకు

ప్రజలందరూ హక్కులెరిగి బాధ్యతగా మెలిగేందుకు