ఎనిమిదో వింత!!

నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకటేమిటి అన్ని రకాల భావాలు ముప్పిరిగొంటాయి.

అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లెవల్లో విని విని విసుగెత్తి పోయింది. అర్జంటుగా కూర్చుని ముందు డాక్యుమెంటేషన్ పనే చేయాలి అని బాగా అర్థమైంది.

దేని గురించో చెప్పలేదు కదా. మా గ్రూపు లక్ష్యం గురించి అండి.

* అందరినీ సమాజ సేవ దిశగా ప్రేరేపించాలి.

* ప్రతి ఒక్కరూ సమాజం పట్ల తమ బాధ్యత నిర్వర్తించే లాగా జనాల్లో మార్పు తీసుకురావాలి.

* ఏ రకంగానైనా సరే, వ్యక్తిగతంగా కావచ్చు, సమూహంగా  కావచ్చు, సంఘసేవ చేసే వారందరినీ ఒక తాటి మీదకు తేవాలి.

ఇలాంటి లక్ష్యాలు అందరికీ  –

ఆచరణ సాధ్యం కాని ఆశయంగానో, లేదా పగటి కలలు గానో, ఓవర్ ఆంబిషస్ నెస్ (అత్యుత్సాహం) గానో కనిపిస్తాయి కాబోలు. 

నా దృష్టిలో ఐడియలిజం కి, ప్రాక్టికాలిటీకి పెద్ద తేడా లేదు. ఐడియల్ అంటే ప్రాక్తికల్ గా పాజిబుల్ చేసి చూపాలి అనేదే నా ధ్యేయం, పాలసీ. అంతే కానీ ఐడియల్స్ అనేవి ప్రాక్టికల్లీ పాజిబుల్ కానివి అని నేను అనుకోను.

లాభం లేదు. వీలైనంత తొందరగా రోజుకి ఒక్క పేరా అయినా సరే నేను మా గ్రూపు గురించి, దాన్ని ఎలా నడిపించాము, ఎలా నడిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని సవివరంగా వ్రాయాలి. 

ప్రకటనలు

22/09/07 : పని – ఫలితం

ఇవాళ అంతా ఫోన్స్ , మెయిల్స్ తోనే సరిపోయింది. ఆఖరికి అమీర్ ఎస్టేట్ లో ఉన్న హాస్టలు పిల్లలని కూడా పిలిచాము. కశ్యప్ తమ్ముడు భార్గవరామునికి బ్లాగు ముఖంగా నా కృతజ్ణ్జతలు. తనే నన్ను తీసుకెళ్ళాడు.

రేపు ఉదయం శ్యామలకుంటలో సుందర్ ధన్వంతరీ యజ్ణ్జం చేయిస్తున్నారు. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జరుగుతుంది. అదయ్యాక ఇక వెన్యూ దగ్గరకి వచ్చి ఆ ఏరియాలో ఉండే హాస్టలు పిల్లలను పిలవాలని ప్లాను.

తెలుగుపీపుల్ వాళ్ళని పిలవడం కుదరలేదు. మెయిల్ ఇద్దామనుకుని మర్చిపోయాను. తీరా రాత్రి నేను వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు.  MVR గారు ఊర్లో ఉండడం లేదు.  PSR గారు వేరే మీటింగ్ కి వెళ్తున్నారు. అది తొందరగా పూర్తైతే దీనికి వస్తాను అన్నారు.

పుణ్యం పుచ్చిపోయి పిలిచిన అందరూ వస్తే ‘హలు నిండినది ‘ బోర్డు పెట్టేయచ్చు 🙂 నా వరకు నేను చాలా సిన్సియర్ గా ప్రయత్నించాను. పని చేయడం నా వంతు. ఫలితం ఇయ్యడం భగవంతుని వంతు. కాకపోతే నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ లేదు. బాబా నాకు బానే తర్ఫీదునిస్తున్నారు పరోక్షంగా. ఇది ఎలా జరిగినా నేను చలించకుండా ఉండాలి అనుకుంటున్నాను. మాస్టరు గారు చెప్పింది అదే కదా. సత్సంగాలప్పుడు, గుడిలో చేసే కార్యక్రమాలప్పుడు చలించకుండా ఉండాలి అని. మరి చూడాలి.

ఒక్క తలస్సీమియా విషయం తప్ప దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసాను ఇవ్వాళ. అదో తృప్తి.

ఎవరి దగ్గరైనా వీడియో కెమెరా ఉంటే తెండి అని అడుగుదాము అనుకున్నా. కానీ బాగుండదేమో అని అడగలేదు. లక్కీగా సుందర్ నిన్న కొన్నారు. యజ్ణ్జం ఉంది, ఈ మీటింగ్ కూడా ఉంది కదా అని కొన్నారుట. అంతకు ముందు మీటింగ్స్ కూడా ఆయన ల్యాప్ టాప్ తో వీడియో తీశారు. అన్నీ కలిపి వచ్చే వారంలో అప్ లోడ్ చేయమని చెప్పాలి.

కౌటిల్య నాన్నగారు, లాయరు ప్రసాదరావు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ణ్జతలు చెప్తున్నాను. ఆయన ఎంత శ్రధ్ధ తీసుకుంటున్నారో చెప్పలేము. రాత్రి వెళ్ళి వెన్యూ చూసొచ్చాను. బాగానే ఉంది. మైకు కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో అంటే దాని గురించి కూడా తనకు తెలిసిన ఓ టెంటు హౌసు వాళ్ళకి ఫోన్ చేసారు. రేపు అది కూడా దొరకచ్చు.

అలాగే సుందర్ గారికి, సత్యాకృష్ణ కి. ఈ అబ్బాయి వారంలో ఆరు రోజులు వర్క్ చేయాలి. ఇంటి బాధ్యత తనదే. ఐనా సరే ఆఫీసు పనుల్లో కానీ, గ్రూపు పనుల్లో కానీ ఎంతో శ్రధ్ధ తీసుకుంటాడు. మా గ్రూపు వాళ్ళని మీటింగ్ కి పిలిచే బాధ్యత తనకి ఇచ్చాను. నేను మెయిల్ చేసాను. ఫాలో అప్ చేసి వాళ్ళు వచ్చేటట్టు చేయడం తన వంతు. 

Important URLs

 Please go through the urls of our group.

http://tomakeadifference.net (under construction. not yet updated completely)

http://birdsofsamefeathers.org (will be updated soon)

http://groups.yahoo.com/group/tomakeadifference

http://groups.yahoo.com/group/education_tomakeadifference

http://groups.yahoo.com/group/health_tomakeadifference

http://groups.yahoo.com/group/likemindedgroups_tomakeadifference

http://groups.google.com/group/birdsofsamefeathers

Please go through my article in Poddu about some of my experiences.

http://poddu.net/?p=263

http://poddu.net/?p=304

My article posted in November, 2007 issue of BHUMIKA magazine.

http://bhumika.org/archives/349

Recent Photos of the new initiatives. 

http://flickr.com/photos/tomakeadifference/

http://picasaweb.google.com/prasanthi.uppalapati/LMGMeeting

http://picasaweb.google.com/prasanthi.uppalapati/MeetingWithSriVijayAnandOfFifthPillar

http://picasaweb.google.com/prasanthi.uppalapati/MeetingOnRTI 

http://picasaweb.google.com/prasanthi.uppalapati/ThalassemiaSessionInNellore

http://picasaweb.google.com/prasutmad.finance/ChildAshram

మనసుంటే మార్గముంటది

దేనికోసమైనా తపిస్తే అది జరిగి తీరుతుందని ఇవాళ మరోసారి ఋజువైంది.

మొన్న సోమవారం సమావేశం అయిన దగ్గర నుంచి ఈ ఆదివారం సమావేశం గురించి ఆలోచనే. గురువారం వరకు కూడా నేను ఊర్లో ఉంటానో, ఉండనో తేల్చుకోలేదు.

విజయవాడలో ప్రపంచ తెలుగు కవుల సభలు జరుగుతున్నాయి. పోయిన సారి జాతీయ సభలకు వెళ్ళాను, తాతగారి కోసం. ఈ సారి అసలు నా తరపున తాతగారే డెలిగేట్ ఫీ కూడా కట్టేసారుట. సుబ్బారావు గారు చెప్పినదాకా నాకు తెలియదు. 23 న కవి సమ్మేళనంలో నా పేరు కూడా ఉంది. స్వాతంత్ర్యం, దేశభక్తికి సంబంధించినది కదా ఏదో వ్రాద్దాములే వెళ్తే అనుకున్నా. కానీ ఇన్ని కార్యక్రమాల మధ్య ఇక వద్దులే అనుకున్నాను.

రాకేష్ కి చెప్పాను. 30 న పెట్టుకుందామా అని. కొంచెం టైము కూడా ఉంటుంది కదా అని. కానీ తను ఇష్టపడలేదు. పోస్ట్ పోన్ చేస్తే అలాగే అవుతుందని. పైగా తను 30 న ఊర్లో ఉంటాడో, లేదో తెలియదు. నాది కూడా అలాంటి మనస్తత్వమే. అనుకుంటే ఏదైనా అయిపోవాలి. లేడికి లేచిందే పరుగు 🙂

కాబట్టి నేను ఊర్లో ఉన్నా, లేకపోయినా మీటింగ్ అరేంజ్ చేయాలనే ప్రయత్నించాను. సుందర్ ఫోన్ చేసి ఆదివారం యజ్ణ్జం పెట్టుకున్నామండి అని చెప్పేదాక ఊగిసలాడుతూనే ఉన్నా వెళ్ళేదా, వద్దా అని.

KMRR రావు గారు వెన్యూ ఇస్తారు కదా. ఏదో 40 మంది అనుకుంటున్నాము కాబట్టి సరిపోతుందిలే అనుకున్నాను. కానీ ఆయన ఊర్లో ఉండడం లేదు. తెలుగుపీపుల్ ఆఫీసులో ఇప్పుడు స్థలం లేదు. ఇక ఎంత మందిని అడిగానో లెక్కే లేదు.

FRF నరేందర్ S R Nagar కమ్యూనిటీ హాల్ లో కనుక్కున్నారు. రోజుకి 2200 రూపాయలు కట్టాలిట. కానీ నిమజ్జనం అయ్యాకే కుదురుతుందిట. నాగార్జున నగర్ వాళ్ళు కూడా 2100 అవుతుంది అన్నారుట. ఇది కౌటిల్య నాన్నగారు ప్రసాద్ గారు కనుక్కున్నారు.

మొదటి సారి తలస్సీమియా మీటింగ్ జరిపిన శ్యాం ప్రసాద్ గారి కార్యాలయంలో జరుపుకుందామా అనుకుంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు RSS వాళ్ళకి అద్దెకి ఇచ్చారుట.

ఎలా అబ్బా. ఇంకా వెన్యూ దొరకలేదు. అందరికీ మెయిల్ పంపాలి అని ఒకటే ఆలోచన. ఆఫీసులో పని కూడా బానే ఉంది. ఎక్కువ మంది పట్టే వెన్యూ దొరికితే బాగుణ్ణు అని అత్యాశ 🙂 పైగా ఇదే ఏరియాలో (in and around Srinagar Colony ) దొరికితే బాగుండు అని 🙂 సుందర్ కి ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆయనేమో ప్రసాద్ గారిని అడిగి చెప్తాను అని.

రాకేష్ , Saayam Cheddam కిషోర్ , దిలీప్ గారు ప్రయత్నిస్తాము వెన్యూ గురించి అని చెప్పారు. బైర్రాజు ఫౌండేషన్ భాస్కర్ గారిని కూడా అడిగాను ఇవాళ ఓ రాయేసి చూద్దామని. ఆయనేమో ముందు చెప్తే ఎలాగోలాగ ప్రయత్నించే వాడిని. ఇంత షార్ట్ నోటీస్ లో కష్టం కదా అన్నారు. అసలు మేము నిర్ణయించుకుందే షార్ట్ నోటీస్ లో. పైగా బైర్రాజు వాళ్ళు ఇస్తారు అని నేను అనుకోలేదు. CSIM లాంటి సంస్థే బయటి వాళ్ళ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వదు.

అయితే ఒకటి అన్ని గ్రూపుల వాళ్ళకి చెప్పేసాను. వెన్యూ శనివారం సాయంత్రానికి తెలుస్తుంది. మధ్యాహ్నమే ఉంటుంది. వెన్యూ ఎక్కడైనా రావాలని చెప్పమని. పైగా నిన్న బాబు గారు చెప్పారు కుందన్ బాగ్ లోని హాస్టల్ లో జరుపుకోమని. 

ఎట్టకేలకు నిన్న రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా తెలిసింది. సుందర్ వాళ్ళ పక్క బిల్డింగే దొరికింది. నేను కోరుకున్నట్టుగానే 100 మందికి సరిపడేంత పెద్దది (ఇంకా పెద్దదిట), అందులోనూ అమీర్ పేటలో సుందర్ హాస్పిటల్ పక్కనే. ఇంతకంటే కావాల్సిందేముంది !! మనసుంటే మార్గముంటది. Thanks to the invisible hand, my baba.

(ఆ ఉత్సాహంతోనే ఇంకా మేలుకునే ఉన్నా. 10 నుంచి నెట్ మీదే ఉన్నా. ఎంతో మందికి మెయిల్ చేసి, ఎన్నో ఫొరం లలో పోస్ట్ చేసి, మా గ్రూపుకి మెయిల్ పెట్టుకుని, ఇంక పడుకోవాలి)

22/9/07 – ఇవాళ్టి పనులు

1. షణ్ముఖి గారిని కలవాలి. సత్యాకృష్ణ వస్తాను అన్నాడు. నేను, సుందర్ , సత్యాకృష్ణ ఇంకా సురేందర్ వెళ్తాము. రేపు ఉదయం ఆవిడకి ఫోన్ చేసి తనకు వీలైన సమయంలో కలవాలి. ఆవిడ చెప్పిన టైము అందరికీ చెప్పాలి.

2. సాయంత్రం హోమియో డాక్టరు గారిని కలవాలి. శ్రీ యు. వి. ఎన్ . కె. రాజు గారు వస్తాను అన్నారు. అక్కడ మరో సమావేశం.

3. FRF వాళ్ళ మీటింగ్ కి వెళ్ళినప్పుడు ఒకరు పరిచయమయ్యారు. వారు ఈ వారం ఇంకా ఊర్లో ఉంటే వాళ్ళని తలస్సీమియా సొసైటీకి వెళ్ళమని చెప్పాలి.

4. రేపు సమావేశానికి సంబంధించి పనులు ఏవైనా ఉంటే చూడాలి. కెప్టెన్ సత్యప్రసాద్ గారితో మాట్లాడాలి.

5. చరణ్ మరియు వినయ్ లకి  ఒకళ్ళ నెంబరు ఒకళ్ళకి ఇచ్చాను. ఎల్లుండి అశోక్ నగర్ స్లం లో వాళ్ళు చదువు చెప్తారు.

6. రేపు ఉదయం సుందర్ శ్యామలకుంటలో యజ్ణ్జం చేస్తున్నారు. ఆరోగ్య యజ్ణ్జం. ఆ విషయం అందరికీ చెప్పాలి.

7. ఆశ్రయ్ ఆకృతి బాబు గారికి వెన్యూ దొరికిన విషయం చెప్పాలి.

8. హరినాథ్ గారిని కలవాలి. OCMS Project గురించి మాట్లాడాలి, అలాగే నెల్లూరు ఋషి శక్తి యోగ మాస్టరు గారికి వెబ్ సైటు Sep 31 కల్లా చేస్తాను అని చెప్పాను. దీని గురించి కూడా హరినాథ్ గారితో మాట్లాడాలి.

హమ్మయ్య

సుందర్ గారు ఓ పెద్ద భారం తీర్చారు. ఇప్పుడే ఫోన్ చేసారు. లాయరు గారితో (మా గ్రూపులోని స్కూల్ పిల్లవాడు కౌటిల్య నాన్నగారు) మాట్లాడారుట. మొన్న విజయ్ గారు చెప్పిన విషయాలు, రాకేష్ చెప్పిన విషయాలు ఓ గంట సేపు వివరించారుట. ఆయన అసలే లాయరు కదా చాలా శ్రద్ధగా విని, ఏవో కొన్ని ప్రశ్నలు కూడా చెప్పి, ఇవి అన్నీ మనం అడుగుదాము అన్నారుట.

ఆయన నాగార్జున నగర్ కమ్యూనిటీ హాల్ కి రెగ్యులర్ గా వెళ్తుంటారుట. కాకపోతే వాళ్ళు డబ్బులు అడగచ్చు. అడిగితే నేనే స్పాన్సర్ చేస్తాను అన్నారుట. సుందర్ ఏమో వాళ్ళు మనకు ఊరికే ఇస్తే మనం ఉచిత మెడికల్ కాంప్ నిర్వహించుదాము అని చెప్పారుట. అంతగా అయితే అన్ని గ్రూపుల వారు కొంత మనీ షేర్ చేసుకునేటట్టు మాట్లాడితే బాగుంటుంది. మా గ్రూపు వాళ్ళు ఏమంటారో కూడా చూడాలి.

ఇదైతే ఎక్కువ మందే పడ్తారు. పుణ్యం పుచ్చిపోయి ఎక్కువమంది వచ్చినా స్థలం సరిపోతుంది. ఇక ఎవరెవరు వస్తున్నారు కంఫర్మ్ చేసుకోవాలి. భలేగుంది. నా అంచనా ప్రకారం ముప్పై కి తగ్గరు. యాభైకి పెరగరు. చూద్దాం.

వీకెండ్ పనులు

ప్రతి సారి వీకెండ్ కోసం ఎదురు చూడడం, ప్యాక్డ్ అప్ అవడంతో ఏవో కొన్నే పనులు జరగడం అవుతోంది. వ్యక్తిగత పనులు అన్నవి కనీసం ఆలోచించడానికి కూడా అవకాశం దొరకడం లేదు. అలాగని అస్సలే సమయం లేదా అంటే ఉంటుంది, కొద్దో, గొప్పో. కానీ సర్వకాల సర్వావస్థల్లోనూ బుర్ర సక్రమంగా పని చేయాలి కదా. ఎవర్ యాక్టివ్ గా బుర్ర లేదు. ఈ వారమంతా యోగా క్లాసుకి వెళ్ళనే లేదు.

కానీ ఒకప్పటికన్నా బాగానే మేనేజ్ చేస్తున్నాను అనుకుంటున్నాను, కానీ ఫలితం లేదు ఎందుకంటె కార్యక్రమాలు కూడా అంతే ఎక్కువగా ఉంటున్నాయి. వీలైనంత వరకు వాయిదా మంత్రం జపించడం లేదు. కనీసం ఇప్పటి నుంచైనా ఎప్పటి పనులు అప్పుడే చేయాలి అనేది పాటిస్తున్నా.

ఎప్పటికప్పుడు పెండింగ్ పనులు పూర్తి చేసి కొంచెం ఖాళీగా ఉందాము, ఒక పద్ధతి అనుకుని అలా ఉందాము అనుకుంటే కుదరడం లేదు.

నేను ఎప్పుడూ రిసల్యూషన్లు తీసుకోను. చేస్తాను అని నమ్మకం లేక. కానీ ఈ సారి చాలా నిర్ణయాలు తీసుకున్నా. ఇక అమలు పరచడమే ఉంది. 2007 నాకు చాలా విషయాలు నేర్పింది.  2008 టార్గెట్ . అప్పటి వరకు అనుకున్నవన్నీ చేస్తూ పోతే, అప్పటికి రెగ్యులరైజ్ అవుతాను కదా. అదీ ఆలోచన. 

మనసుంటే మార్గమూ ఉంటుంది కదా. విజయం సాధించగలననే అనుకుంటున్నాను.