దివ్య

దివ్య కూడా టిపి సభ్యురాలే. రాజు కేసులో దివ్య పరిచయం. అప్పుడు తను సహాయం చేయడమే కాకుండా తన స్నేహితులైన మరిద్దరు టిపి సభ్యుల చేత కూడా డబ్బులు ఇప్పించింది. అప్పుడే తనకి గ్రూపు గురించి చెప్పి చేరుతారా అని అడిగాను. తను ఒప్పుకోగానే మెంబర్ గా యాడ్ చేసాను. అప్పటి నుంచి తను యాక్టివే. ఎంత యాక్టివ్ అంటే నావి, దివ్యవే మెయిల్స్ ఎక్కువ ఉండేవి. ఇద్దరికీ గ్రూపు ప్రాణంతో సమానం. రోజూ గ్రూపు మెయిల్స్ చదవాల్సిందే. చదివిన వాటికి రిప్లై చేయాల్సిందే. ఎన్ని పనులున్నా, ఇంకేమైనా సరే గ్రూపే టాప్ ప్రయారిటీ.

తినని మొదట కలుసుకున్నది టిపి ఆఫీసులోనే. తను ఇండియా వచ్చినప్పుడు రాజుని కలవడానికి వచ్చింది. అప్పుడు తను చెప్పిన విషయం ఇప్పటికీ నేను మర్చిపోలేను. తను ఎంత కష్టపడి నిలదొక్కుకుంది, అలాగే తన భావాలు ఇలాగ. ఇంకొక విషయమేమిటంటే తన అందం 🙂 తన పెళ్ళి ఫోటో చూపించింది. (బ్లాగు అంటే మనస్ఫూర్తిగా మన మనసులో ఉండేవి వ్రాస్తాము కాబట్టే ఇది కూడా వ్రాశాను). తన గొంతు కూడా అంతే శ్రావ్యంగా ఉంటుంది. ఇక తన పాప ఆద్య అయితే ఇక చెప్పక్కరలేదు.

చాలా సున్నిత స్వభావం. కాకపోతే సమాజాన్ని కూడా బాగా అర్థం చేసుకుంది కాబట్టి అందరినీ అలర్ట్ చేస్తూ ఉంటుంది. యూ ఎస్ నుంచి కాల్స్ చేస్తుంది అవసరమైనప్పుడల్లా. విషాల్ అయితేనేమి, దీవెన అయితేనేమి తను ఫోన్ చేసి వారికి ధైర్యం చెప్పేది. ఎమోషనల్ సపోర్ట్ కోసం. గ్రూపు కి సంబంధించినంత వరకు, గ్రూపుని ప్రారంభించిన నాకు గ్రూపు అంటే ఎలాంటి ఇష్టమో తనకీ అంతే. గ్రూపుని బిడ్డతో పోలిస్తే,  నేను కంటే తను నాతో పాటు పెంచింది.

ప్రస్తుతం తిను కూడా వ్యక్తిగత కారణాల వల్ల విరామంలో ఉంది.

ప్రకటనలు

వాణి

వాణి మా గ్రూపులో మొదట చేరిన సభ్యుల్లో ఒకరు. తిను కూడా తెలుగుపీపుల్ ద్వారా పరిచయమే. తను వ్రాసిన దానికి నేను వ్యాఖ్య వ్రాయడమో, లేక తను నా వ్యాసం చదవడమో ఏదో గుర్తులేదు కానీ మొత్తానికి టిపి లో పరిచయమే. నిజానికి గ్రూపులో మొదటి మెయిల్స్ అన్నీ తనవే. బాగా ఆక్టివ్ గా ఉండేది. కానీ అప్పుడు తను చదువుకుంటున్న కారణంగా ఒక సంవత్సరం పాటు దూరంగా ఉంది. తరువాత మళ్ళీ ఆక్టివ్ గా పార్టిసిపేట్ చేయడం మొదలుపెట్టింది. తినని మొదటిసారిగా కలుసుకుంది కిషోర్ పుట్టా ఫౌండేషన్ వారితో సమావేశమైన రోజున. తను లంచ్ కి రాకపోయినా తరువాత సమావేశానికి వచ్చింది.

మెయిల్స్ లో యాక్టివ్ గా ఉండడం, బాధ్యత తీసుకోవడం మొదలుపెట్టింది. అంత వరకు అందరికీ ఏంటి ప్రశాంతి ఒక్కటేనా చేస్తోంది అన్నట్లు ఉండేది. కానీ వాణి వచ్చాక మిగతా అందరి భాగస్వామ్యం కూడా పెరిగింది. అందరినీ నెలవారీ సమావేశాలకి ఆహ్వానించే బాధ్యత చేపట్టింది. దుప్పట్ల పంపిణీ, ఆహార పంపిణీ, లక్ష్మీ నరసమ్మ, దీవెన ఇలా ప్రతిదాంట్లోను తన భాగస్వామ్యం ఉంది. 

ఈ మధ్య ఆఫీసు పని కారణంగా మరలా విరామంగా ఉంటోంది. ఈ అమ్మాయికి కూడా సౌమ్య లాగే పిల్లలకి చదువు చెప్పడం ఇష్టం. ఆషా అనే గ్రూపులో సభ్యురాలు. ఆదరణ గ్రూపు పిల్లలకి పాఠాలు చెప్తూ ఉంటుంది.

స్త్రీ పక్షపాతం అని కాదు కానీ, ప్రత్యేకంగా వాణిని, సౌమ్యని చూస్తే నాకు చాలా గర్వంగా ఉంటుంది. అమ్మాయిలు ఎలా ఉండాలి అని నా అభిప్రాయమో అలా ఉంటారు వాళ్ళు. ఆదర్శ భావాలు, వాటికి తగిన ఆచరణ, నిబద్ధత, సమాజం పట్ల బాధ్యత, ఏదో చేయాలనే తపన ఇలాంటివన్నీ నచ్చుతాయి నాకు.   

సౌమ్య

చంద్ర గారి తరువాత నేను గుర్తుకు తెచ్చుకునే మనిషి సౌమ్య. తిను కూడా తెలుగుపీపుల్ సైటు ద్వారా పరిచయమే. కవితలు, వ్యాసాలు వ్రాయడం, ఒకరి రచనలకు ఇంకొకరం వ్యాఖ్యలు వ్రాయడం తప్పితే వ్యక్తిగత పరిచయం లేదు. ఒకసారి తను మెయిల్ చేసింది, నేను బాబా మీద వ్రాసిన వ్యాసం మరియు కవితలు చదివాక. అలా కొన్ని మెయిల్స్ నడిచాయి. ఆ సమయంలోనే అస్మా కేసు, ఆ తరువాత గ్రూపు ప్రారంభించడం జరిగింది. లింక్ పంపగానే సభ్యురాలిగా చేరింది.

చేరినప్పటి నుండి తనది యాక్టివ్ పార్టిసిపేషన్ . మొదటిసారి మేము కలుసుకున్నది నేత్రదానం గురించి సుకుమార్ రెడ్డి గారి ఉపన్యాసం ఏర్పాటు చేసినప్పుడు, తెలుగుపీపుల్ ఆఫీసులోనే. ఆ తరువాత అభిరుచులు కూడా ఒకటే అని తెలిసాక మా మధ్య స్నేహం మొదలైంది. నిజానికి నాకు టిపి సభ్యుడొకతను మెయిల్ చేసారు సౌమ్య పేరుతో కవితలు, వ్యాసాలు వ్రాసేది నేనేనా అని 🙂

ప్రతి నెల జరిగే సమావేశానికి వచ్చేది. కరెక్టుగా టైముకి. సౌమ్య వస్తాను అన్నది అంటే నాకు నిశ్చింత. నాకు ఒక అయిదు నిముషాలు అటు ఇటు అయినా పర్లేదు తను వచ్చి ఉంటుందిలే అని.

మురికివాడకి వెళ్ళి దుస్తులు ఇచ్చినప్పుడు కానీ, ఈనాడు ఆఫీసులో రామకృష్ణ గారితో చర్చించడానికి వెళ్ళినప్పుడు కానీ తనే నాకు తోడు.  మెడికల్ కాంప్ , రక్తదానం, స్వాతి కోసం పుస్తకాలు కొనడం ఇలా అన్నిటిలోను తను శ్రధ్ధగా పాల్గొంది. 

ఎం ఎస్ రీసెర్చ్ జాయిన్ అవడంతో తనకు సమయం లేక గ్రూపు నుంచి విరమించుకుంది. కానీ సమాజసేవ నుంచి కాదు.  ట్రిపుల్ ఐ టి లోని ఆషా కిరణ్ లో సభ్యురాలిగా ఎంతో చేస్తోంది. తనకు తెలిసిన వారందరికీ ఈ గ్రూపు గురించి చెప్తుంది. గ్రూపు కోసం తన అనుభవాలతో కూడిన బ్లాగు వ్రాయమని అడగగానే ఒప్పుకుని వ్రాస్తోంది. 

ఈ అమ్మాయి అంటే నాకెంతో ఇష్టం. పుస్తకాల పురుగు అయినందు వల్ల, నిబద్ధత మరియు ఖచ్చితమైన అభిప్రాయాలు కలిగిన వ్యక్తి కావడం వల్ల, స్టీరియోటైపు అమ్మాయి కానందువల్ల.

తన బ్లాగులు:

vbsowmya.wordpress.com
musingsinc.wordpress.com

చంద్రశేఖర్ బొమ్మిశెట్టి

చంద్ర గారు నాకు తెలుగుపీపుల్ వెబ్ సైటు ద్వారా పరిచయం. నా సహోద్యోగి. ఇతనిది మహా జాలి గుండె. ఇలాంటి మనిషి నాకు ఇంతవరకు తారసపడలేదు. ఎదుటి వాళ్ళ బాధలు తనవిగా చేసుకుని బాధపడతారు. తన శక్తికి మించి సహాయం చేస్తారు. నాకు వ్యక్తిగతంగా కూడా ఎంతో సాయం చేసారు. 

ఇక గ్రూపు విషయానికి వస్తే మేము మొదట తీసుకున్న అస్మా కేసు బాధ్యత మొత్తం ఈయనదే. నేను చేసింది ఏమీ లేదు, అందరికీ అప్ డేట్స్ ఇవ్వడం తప్పితే. నిజానికి గ్రూపు పెట్టాలన్న ఆలోచనకు ప్రేరణే అస్మా కేసు. (వేరే బ్లాగులో వివరముగా దీని గురించి ప్రస్తావిస్తాను).

గ్రూపు మొదటి వార్షికోత్సవం వరకు ఈయన చాలా బాధ్యతలు తీసుకున్నారు. ఆ తరువాత వ్యక్తిగత, ఆఫీసు పనులతో బిజీ అయిపోయారు. ఈ మధ్యే పెళ్ళి కూడా అయింది కాబట్టి తనకి అంత వీలు చిక్కడం లేదు. విరామంగా ఉంటున్నారు.

Current Activities Planned in TMAD

Friends, TMAD, is slowly gearing up and getting organized. We are badly in need of volunteers and funding.

We are now gearing up and working on a calendar of events for the entire year which would be roughly in the following lines:
 
1. Every Quarter – Used Items Collection (Clothes, Books, Utensils etc.,)
2. Every Quarter – Blood Donation
3. Every June/July –  Plantation Programmes
4. Every December – Blanket Distribution
5. Yearly Once – Excursion of School Children – One within the City and the other outside the City
6. Regular – Sponsorship of Prizes for Aug 15 and Jan 26 and also Sweets/Fruits Distribution
7. New Year Day – Visit to a specific home, distribute sweets/fruits and spend quality time
8. Monthly – Meeting on First Sunday @ any orphan home or old age home or MR home etc.,
9. Monthly – Food Distribution – This is for the slum children who are being taught by an NGO.

As a policy and principle, we do not give money to the NGO but distribute food to them – Lunch and Snacks. If we get more amount for food distribution alone, we will increase the no. of days in a month. We didn’t get much support to distribute to roadside people and beggars. So I came up with this thought of consistently helping one particular home where there is dire need.
 
Your consistent support like earlier would be a great boost to your activities.
 
Looking forward for more no. of volunteers and funding. Ours is a tax exempted group. So every donation you make, is entitled to get 50% exemption. Say, for example, your taxable income is 10,000 rs. and if you donate 1000 rs., you have to pay tax only for 9,500 rs.

Name of the Bank:  ICICI Bank Limited
Account Name: TO MAKE A DIFFERENCE (TMAD)
Account Number: 000801210382
Branch: Khairatabad or CIBD (whichever displays in the list)
NEFT/IFSC/RTGS Code: ICIC0000008
 
Request to send a mail to: finance@tmad.org with the following details:

  • Date of Transfer
  • Transaction Amount
  • Cause for Which you are Donation (Group Fund, Education, Medical, Food Distribution, Blanket Distribution, Blood Donation Activity, Support to Differently Abled etc.,)
  • Name on which the receipt has to be issued and your address

Visit, TMAD.ORG, for more details.

Current Activities:

1. Blanket Distribution – Required Funding -Rs. 15,000

https://prasanthi.wordpress.com/2012/11/28/when-the-weather-is-cold-out-there-helping-hands-are-required-to-extend-the-warmth/

2. Excursion of SSC Students to Bidar – Required Funding – Rs. 60,000 to Rs. 70,000

3. Food Distribution – Required Funding – Rs. 2500 a month

4. New Year Activity – Required Funding – Rs. 7500 

The blog posts will be added for each of these requirements. Keep visiting this page.