రాకేష్ కుమార్ దుబ్బుడు

రాకేష్ గురించి ఎంత చెప్పినా తక్కువే. నేను ఇంత వరకు కలిసిన వాళ్ళల్లో హీరో అనిపించిన మొదటి వ్యక్తి.
ఈ అబ్బాయిని నేను సెప్టెంబర్ 17, 2007 న కలిసాను, చాలా విచిత్రంగా. ఆ రోజు ఉదయం నాకు ఒక ఈ మెయిల్ వచ్చింది. ఎవరి దగ్గర నుంచి !! ఫిఫ్త్ పిల్లర్ అనే సంస్థ అధ్యక్షులైన విజయ్ ఆనంద్ గారి నుంచి. అంతకు కొద్ది రోజుల ముందే వారి గురించి చదివాను. లంచం ఇవ్వము, పుచ్చుకోము అని [...]

ఫయాజ్

ఈ అబ్బాయి నాకు పవన్ ద్వారా పరిచయం. పవన్ డిసెంబరు 9 సమావేశం గురించి ఫయాజ్ కి చెప్పి నా నంబరు ఇచ్చి కలవమని చెప్పాడు. ఫయాజ్ నెల్లూరికి చెందిన వాడు కావడం వలన స్నేహితుల ద్వారా పవన్ గురించి తెలిసింది.
ఆ రోజు సమావేశంలో హడావిడి మూలాన నాకు మొదటి విభాగం అనగా ఉదయాన జరిగిన పరిచయాలు వినడం కుదరలేదు. ఆ తరువాత ఈ అబ్బాయి నుంచి ఎలాంటి వర్తమానం లేదు. ఏమిటోలే అనుకున్నాను. నా ప్రయత్నం [...]