ఏనాడైనా అనుకున్నానా కల్లో ఐనా – 1

 ఈ వ్యాసం పొద్దు మేగజైనులో జూలై నెల మొదటి ఆదివారం ప్రచురితమైంది. కశ్యప్ కి, త్రివిక్రం గారికి నా కృతజ్ణ్జతలు.
<a target=”_blank” href=”http://poddu.net/?p=263“> పొద్దులో నా వ్యాసానికి లంకె.</a>
======================= 
నాకు ప్రతి ఆదివారం ఓ అనాథాశ్రమానికో, వృద్ధాశ్రమానికో వెళ్ళాలని ఉండేది. ఏదైనా మంచి పని చేయాలని ఉండేది. ముందు నిలబడే చొరవ లేక ఎవరైనా ముందు నడుస్తుంటే వారి వెనుక నేను పని చేద్దాం అనుకునేదాన్ని. మొత్తానికి ఏమీ చేయకుండానే కాలం గడిచిపోయింది.
కార్గిల్ యుద్ధం అప్పుడు మాత్రం ఏదైనా చేయాలనే [...]

సేవ – సగటు మనిషి

 ఈ వ్యాసం నవంబరు 2007 భూమిక సంచికలో ప్రచురింపబడింది. భూమిక సంపాదకురాలు కొండవీటి సత్యవతి గారికి కృతజ్ణ్జతలతో.
భూమికలోని నా వ్యాసానికి లంకె.
 ========
అనామకం
నా అస్థిత్వాన్ని నేనెందుకు వ్యక్తపరచనో తెలుసా?
నాలోని భావనా వీచికలు, ఆలోచనా ప్రవాహాలు
నా ఈ కవితలు
అవి ఇంతవరకు అక్షర రూపమే దాల్చాయి
ఇంకా ఆచరణ మార్గం పట్టలేదు
ఆశయదీపం వెలిగించలేదు
అలా జరిగిన రోజున,
సగర్వంగా ప్రకటిస్తాను
నేనే ఈ కవితలు వ్రాసానని
మహదానందంగా మనవి చేస్తాను
నేనే ఈ ఆలోచనలు చేసానని
ప్రస్థానం
ఒకప్పుడు
ఆవేశం అక్షరాలు ఒలికించేది
ఆవేదన కాగితంతో గోడు వెళ్ళబోసుకునేది
ఇప్పుడు
ఆవేశం, ఆవేదన …. ఆలోచనగా మారాక
ఆచరణ మార్గం [...]

నా విజన్ మరియు డిసెంబరు 9 సమావేశం

“ఎన్నో రోజుల నిరీక్షణం,
ఫలించిందీ క్షణం”
ఈ పంక్తులు నేను ఓ పెళ్ళి కోసం రాసిన కవితలోని మొదటి పాదం లోనివి.
పెళ్ళి గురించి కాకపోయినా అలాంటి అనుభూతే కలుగుతోంది. ఈ నెల 9 వ తారీఖున నేను తలపెట్టిన సమావేశం వ్యక్తిగతంగా నాకు ఎంతో ప్రియమైనది. సెప్టెంబరు 9 న జరిపింది ఓ మొదటి అడుగు అయితే, ఇది అడుగులు వేసే ప్రయత్నం.
ఎందుకు నేను ఓ సమస్యకి అంకితం కాకుండా, అన్నిటిలోను కలుగచేసుకుంటున్నానని ప్రశ్నించేవాళ్ళకి సమాధానం ఇచ్చి ఇచ్చి ఓ [...]