ఇవాళ అంతా ఫోన్స్ , మెయిల్స్ తోనే సరిపోయింది. ఆఖరికి అమీర్ ఎస్టేట్ లో ఉన్న హాస్టలు పిల్లలని కూడా పిలిచాము. కశ్యప్ తమ్ముడు భార్గవరామునికి బ్లాగు ముఖంగా నా కృతజ్ణ్జతలు. తనే నన్ను తీసుకెళ్ళాడు.
రేపు ఉదయం శ్యామలకుంటలో సుందర్ ధన్వంతరీ యజ్ణ్జం చేయిస్తున్నారు. ఉదయం 8:30 నుంచి 10:30 వరకు జరుగుతుంది. అదయ్యాక ఇక వెన్యూ దగ్గరకి వచ్చి ఆ ఏరియాలో ఉండే హాస్టలు పిల్లలను పిలవాలని ప్లాను.
తెలుగుపీపుల్ వాళ్ళని పిలవడం కుదరలేదు. మెయిల్ ఇద్దామనుకుని మర్చిపోయాను. తీరా రాత్రి నేను వెళ్ళేటప్పటికి అందరూ వెళ్ళిపోయారు. అఫ్ కోర్స్ ఇప్పుడు అక్కడ నాకు తెలిసిన వాళ్ళు చాలా తక్కువ మందే ఉన్నారు. MVR గారు ఊర్లో ఉండడం లేదు. PSR గారు వేరే మీటింగ్ కి వెళ్తున్నారు. అది తొందరగా పూర్తైతే దీనికి వస్తాను అన్నారు.
పుణ్యం పుచ్చిపోయి పిలిచిన అందరూ వస్తే ‘హలు నిండినది ‘ బోర్డు పెట్టేయచ్చు
నా వరకు నేను చాలా సిన్సియర్ గా ప్రయత్నించాను. పని చేయడం నా వంతు. ఫలితం ఇయ్యడం భగవంతుని వంతు. కాకపోతే నాకు ఇప్పుడు ఎలాంటి ఫీలింగ్ లేదు. బాబా నాకు బానే తర్ఫీదునిస్తున్నారు పరోక్షంగా. ఇది ఎలా జరిగినా నేను చలించకుండా ఉండాలి అనుకుంటున్నాను. మాస్టరు గారు చెప్పింది అదే కదా. సత్సంగాలప్పుడు, గుడిలో చేసే కార్యక్రమాలప్పుడు చలించకుండా ఉండాలి అని. మరి చూడాలి.
ఒక్క తలస్సీమియా విషయం తప్ప దాదాపుగా అన్ని పనులు పూర్తి చేసాను ఇవ్వాళ. అదో తృప్తి.
ఎవరి దగ్గరైనా వీడియో కెమెరా ఉంటే తెండి అని అడుగుదాము అనుకున్నా. కానీ బాగుండదేమో అని అడగలేదు. లక్కీగా సుందర్ నిన్న కొన్నారు. యజ్ణ్జం ఉంది, ఈ మీటింగ్ కూడా ఉంది కదా అని కొన్నారుట. అంతకు ముందు మీటింగ్స్ కూడా ఆయన ల్యాప్ టాప్ తో వీడియో తీశారు. అన్నీ కలిపి వచ్చే వారంలో అప్ లోడ్ చేయమని చెప్పాలి.
కౌటిల్య నాన్నగారు, లాయరు ప్రసాదరావు గారికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ణ్జతలు చెప్తున్నాను. ఆయన ఎంత శ్రధ్ధ తీసుకుంటున్నారో చెప్పలేము. రాత్రి వెళ్ళి వెన్యూ చూసొచ్చాను. బాగానే ఉంది. మైకు కూడా పెట్టుకుంటే బాగుంటుందేమో అంటే దాని గురించి కూడా తనకు తెలిసిన ఓ టెంటు హౌసు వాళ్ళకి ఫోన్ చేసారు. రేపు అది కూడా దొరకచ్చు.
అలాగే సుందర్ గారికి, సత్యాకృష్ణ కి. ఈ అబ్బాయి వారంలో ఆరు రోజులు వర్క్ చేయాలి. ఇంటి బాధ్యత తనదే. ఐనా సరే ఆఫీసు పనుల్లో కానీ, గ్రూపు పనుల్లో కానీ ఎంతో శ్రధ్ధ తీసుకుంటాడు. మా గ్రూపు వాళ్ళని మీటింగ్ కి పిలిచే బాధ్యత తనకి ఇచ్చాను. నేను మెయిల్ చేసాను. ఫాలో అప్ చేసి వాళ్ళు వచ్చేటట్టు చేయడం తన వంతు.
: నందు ఉంచబడ్డది; Diary