ఎనిమిదో వింత!!

నిజంగా నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది. ఒకటేమిటి అన్ని రకాల భావాలు ముప్పిరిగొంటాయి.

అరిగిపోయిన గ్రామఫోన్ రికార్డు లెవల్లో విని విని విసుగెత్తి పోయింది. అర్జంటుగా కూర్చుని ముందు డాక్యుమెంటేషన్ పనే చేయాలి అని బాగా అర్థమైంది.

దేని గురించో చెప్పలేదు కదా. మా గ్రూపు లక్ష్యం గురించి అండి.

* అందరినీ సమాజ సేవ దిశగా ప్రేరేపించాలి.

* ప్రతి ఒక్కరూ సమాజం పట్ల తమ బాధ్యత నిర్వర్తించే లాగా జనాల్లో మార్పు తీసుకురావాలి.

* ఏ రకంగానైనా సరే, వ్యక్తిగతంగా కావచ్చు, సమూహంగా  కావచ్చు, సంఘసేవ చేసే వారందరినీ ఒక తాటి మీదకు తేవాలి.

ఇలాంటి లక్ష్యాలు అందరికీ  -

ఆచరణ సాధ్యం కాని ఆశయంగానో, లేదా పగటి కలలు గానో, ఓవర్ ఆంబిషస్ నెస్ (అత్యుత్సాహం) గానో కనిపిస్తాయి కాబోలు. 

నా దృష్టిలో ఐడియలిజం కి, ప్రాక్టికాలిటీకి పెద్ద తేడా లేదు. ఐడియల్ అంటే ప్రాక్తికల్ గా పాజిబుల్ చేసి చూపాలి అనేదే నా ధ్యేయం, పాలసీ. అంతే కానీ ఐడియల్స్ అనేవి ప్రాక్టికల్లీ పాజిబుల్ కానివి అని నేను అనుకోను.

లాభం లేదు. వీలైనంత తొందరగా రోజుకి ఒక్క పేరా అయినా సరే నేను మా గ్రూపు గురించి, దాన్ని ఎలా నడిపించాము, ఎలా నడిస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నాను అని సవివరంగా వ్రాయాలి. 

2 స్పందనలు

  1. నిజమే…సమాజ సేవతో పాటు, సమాజం పట్ల పౌర కర్తవ్యాలు, అభ్యుదయ లక్షణాలు పెరగాలని కోరుకుందాం.

  2. http://www.philanthropycapital.org/ బహుశ ఇది మీకు కొంత దిశానిర్దేశానికి సహాయం చేయవచ్చు!

ప్రత్యుత్తరమిమ్ము