మనసుంటే మార్గముంటది

దేనికోసమైనా తపిస్తే అది జరిగి తీరుతుందని ఇవాళ మరోసారి ఋజువైంది.

మొన్న సోమవారం సమావేశం అయిన దగ్గర నుంచి ఈ ఆదివారం సమావేశం గురించి ఆలోచనే. గురువారం వరకు కూడా నేను ఊర్లో ఉంటానో, ఉండనో తేల్చుకోలేదు.

విజయవాడలో ప్రపంచ తెలుగు కవుల సభలు జరుగుతున్నాయి. పోయిన సారి జాతీయ సభలకు వెళ్ళాను, తాతగారి కోసం. ఈ సారి అసలు నా తరపున తాతగారే డెలిగేట్ ఫీ కూడా కట్టేసారుట. సుబ్బారావు గారు చెప్పినదాకా నాకు తెలియదు. 23 న కవి సమ్మేళనంలో నా పేరు కూడా ఉంది. స్వాతంత్ర్యం, దేశభక్తికి సంబంధించినది కదా ఏదో వ్రాద్దాములే వెళ్తే అనుకున్నా. కానీ ఇన్ని కార్యక్రమాల మధ్య ఇక వద్దులే అనుకున్నాను.

రాకేష్ కి చెప్పాను. 30 న పెట్టుకుందామా అని. కొంచెం టైము కూడా ఉంటుంది కదా అని. కానీ తను ఇష్టపడలేదు. పోస్ట్ పోన్ చేస్తే అలాగే అవుతుందని. పైగా తను 30 న ఊర్లో ఉంటాడో, లేదో తెలియదు. నాది కూడా అలాంటి మనస్తత్వమే. అనుకుంటే ఏదైనా అయిపోవాలి. లేడికి లేచిందే పరుగు :)

కాబట్టి నేను ఊర్లో ఉన్నా, లేకపోయినా మీటింగ్ అరేంజ్ చేయాలనే ప్రయత్నించాను. సుందర్ ఫోన్ చేసి ఆదివారం యజ్ణ్జం పెట్టుకున్నామండి అని చెప్పేదాక ఊగిసలాడుతూనే ఉన్నా వెళ్ళేదా, వద్దా అని.

KMRR రావు గారు వెన్యూ ఇస్తారు కదా. ఏదో 40 మంది అనుకుంటున్నాము కాబట్టి సరిపోతుందిలే అనుకున్నాను. కానీ ఆయన ఊర్లో ఉండడం లేదు. తెలుగుపీపుల్ ఆఫీసులో ఇప్పుడు స్థలం లేదు. ఇక ఎంత మందిని అడిగానో లెక్కే లేదు.

FRF నరేందర్ S R Nagar కమ్యూనిటీ హాల్ లో కనుక్కున్నారు. రోజుకి 2200 రూపాయలు కట్టాలిట. కానీ నిమజ్జనం అయ్యాకే కుదురుతుందిట. నాగార్జున నగర్ వాళ్ళు కూడా 2100 అవుతుంది అన్నారుట. ఇది కౌటిల్య నాన్నగారు ప్రసాద్ గారు కనుక్కున్నారు.

మొదటి సారి తలస్సీమియా మీటింగ్ జరిపిన శ్యాం ప్రసాద్ గారి కార్యాలయంలో జరుపుకుందామా అనుకుంటే ఆ బిల్డింగ్ ఇప్పుడు RSS వాళ్ళకి అద్దెకి ఇచ్చారుట.

ఎలా అబ్బా. ఇంకా వెన్యూ దొరకలేదు. అందరికీ మెయిల్ పంపాలి అని ఒకటే ఆలోచన. ఆఫీసులో పని కూడా బానే ఉంది. ఎక్కువ మంది పట్టే వెన్యూ దొరికితే బాగుణ్ణు అని అత్యాశ :) పైగా ఇదే ఏరియాలో (in and around Srinagar Colony ) దొరికితే బాగుండు అని :) సుందర్ కి ఫోన్ చేస్తూనే ఉన్నా. ఆయనేమో ప్రసాద్ గారిని అడిగి చెప్తాను అని.

రాకేష్ , Saayam Cheddam కిషోర్ , దిలీప్ గారు ప్రయత్నిస్తాము వెన్యూ గురించి అని చెప్పారు. బైర్రాజు ఫౌండేషన్ భాస్కర్ గారిని కూడా అడిగాను ఇవాళ ఓ రాయేసి చూద్దామని. ఆయనేమో ముందు చెప్తే ఎలాగోలాగ ప్రయత్నించే వాడిని. ఇంత షార్ట్ నోటీస్ లో కష్టం కదా అన్నారు. అసలు మేము నిర్ణయించుకుందే షార్ట్ నోటీస్ లో. పైగా బైర్రాజు వాళ్ళు ఇస్తారు అని నేను అనుకోలేదు. CSIM లాంటి సంస్థే బయటి వాళ్ళ మీటింగ్ కి పర్మిషన్ ఇవ్వదు.

అయితే ఒకటి అన్ని గ్రూపుల వాళ్ళకి చెప్పేసాను. వెన్యూ శనివారం సాయంత్రానికి తెలుస్తుంది. మధ్యాహ్నమే ఉంటుంది. వెన్యూ ఎక్కడైనా రావాలని చెప్పమని. పైగా నిన్న బాబు గారు చెప్పారు కుందన్ బాగ్ లోని హాస్టల్ లో జరుపుకోమని. 

ఎట్టకేలకు నిన్న రాత్రి 10 గంటలకు ఖచ్చితంగా తెలిసింది. సుందర్ వాళ్ళ పక్క బిల్డింగే దొరికింది. నేను కోరుకున్నట్టుగానే 100 మందికి సరిపడేంత పెద్దది (ఇంకా పెద్దదిట), అందులోనూ అమీర్ పేటలో సుందర్ హాస్పిటల్ పక్కనే. ఇంతకంటే కావాల్సిందేముంది !! మనసుంటే మార్గముంటది. Thanks to the invisible hand, my baba.

(ఆ ఉత్సాహంతోనే ఇంకా మేలుకునే ఉన్నా. 10 నుంచి నెట్ మీదే ఉన్నా. ఎంతో మందికి మెయిల్ చేసి, ఎన్నో ఫొరం లలో పోస్ట్ చేసి, మా గ్రూపుకి మెయిల్ పెట్టుకుని, ఇంక పడుకోవాలి)

ప్రత్యుత్తరమిమ్ము