5th Pillar – Public Relations Coordinator

(About me విభాగంలో, అవినీతి – 2 అనే టపా  చదివితే ఇది అర్థం అవుతుంది.)

సమావేశం

విజయ్ గారు నన్ను Public Relations Coordinator (PRC) గా ఉండమన్నారు. పేరు వద్దులెండి పని చేస్తాను అన్నాను. ప్రస్తుతానికి ఎవరూ లేరు కదా, మరి మనం ముందుకు తీసుకెళ్ళాలి కదా అన్నారు. సరే అన్నాను. ఆ బాధ్యత దిశగా ప్రయత్నాలు మొదలుపెట్టాను. 

విజయవాడలో సమావేశానికై శ్రీ గుత్తికొండ సుబ్బారావు గారితో మాట్లాడాను. ప్రస్తుత ప్రపంచ తెలుగు రచయితల మహాసభలు అయ్యాక, కొంచెం సావకాశంగా ఏర్పాటు చేద్దాము అన్నారాయన.

నెల్లూరులో జరపడానికి శ్రీ పెరుగు రామకృష్ణ గారితో మాట్లాడాలి. ఆర్కుత్ లో ఉన్న మిగతా గ్రూపుల వారి స్థానిక సభ్యుల సహాయంతో అన్ని జిల్లాల్లోను సమావేశాలు జరిపేందుకు కృషి చేయాలి.

వీటన్నిటికంటే ముందుగా ఈ PRC అనే టోపీని వదిలించుకోవాలి. ఓ కార్యకర్తగానే తప్ప, ఏ రకమైన హోదాని నేను కావాలనుకోవడం లేదు. అన్నిటికీ మించి నాకు అర్హత లేదు. నేను స్వభావ పరంగా పిరికిదాన్ని. దానికి తోడు ముందు ఉండడం నాకు అస్సలు ఇష్టం లేదు.

వీలైనంత తొందరగా ఈ అంశాన్ని గురించి మాట్లాడి నా బరువుని దించేసుకోవాలి. అలాగైతే తప్ప నేను మనశ్శాంతిగా ఉండలేను.

ప్రత్యుత్తరమిమ్ము