వరుసగా రెండవ వారం కూడా ఓ మంచి కార్యక్రమం జరగడం, దానికి హాజరవడం, మరో రెండు గ్రూపుల వారు LMG Forum లో చేరడం అత్యంత ఉత్సాహాన్నిచ్చింది. ఆ వివరాలు మా గ్రూపులో మెయిల్ చేసి ఆనందపడ్డాను.
పక్క రోజే అనగా సెప్టెంబరు 17, సోమవారం 11:59 నిముషాలకు విజయ్ గారి నుంచి మెయిల్ వచ్చింది — తాను AIMS India వ్యవస్థాపకులు అని, కలిసి మాట్లాడుకోగలిగితే బాగుంటుందని. వెంటనే సమాధానం వ్రాసాను సరేనని.
ఫోనులో మాట్లాడాక ఆ రోజు శాయంత్రం ఏడు గంటలకి కలుద్దామని అనుకున్నాము. వెన్యూ అంటే ఉందిగా మా కల్పవృక్షం. సుందర్ ఆసుపత్రి. అదే. అక్కడే. విజయ్ గారికి చెప్పాకే, సుందర్ కి ఫోన్ చేసి మాట్లాడాను. ఫలానా, ఫలానా మీ ఆసుపత్రికే వస్తున్నాము అని. సరే అన్నారు. (పాపం ఎప్పుడు కాదన్నారు కనుక. చాలా వరకు మా సమావేశాలన్నీ ఆయన దగ్గరే కదా)
ఇక copy to CM, copy to PM పని మొదలెట్టాను. LMG Forum కి మెయిల్ పెత్తడం, మా గ్రూపుకి, ఇంకా కొంత మంది స్నేహితులకీను. మధ్యాహ్నం భోజనానికి ఇంటికి వచ్చినప్పుడు ఆర్కుట్ లోను. అది కాక కొంతమందికి ఫోనులు. అదృష్టవశాత్తు రలేము అని ఎంతమంది చెప్పారో, రాగలము అని అంతే మంది చెప్పారు.
మొత్తానికి ఐదు గ్రూపులు పాల్గొనగా ఈ సమావేశం చాలా విజయవంతంగా ముగిసింది.
ఫోటోలకు ఇక్కడ చూడండి:
http://picasaweb.google.com/prasanthi.uppalapati/MeetingWithSriVijayAnandOfFifthPillar
సమావేశా వివరాలు ఇక్కడ ఫైలు లో దొరుకుతాయి:
http://groups.google.com/group/birdsofsamefeathers
: నందు ఉంచబడ్డది; TMAD Group