ఉద్దేశ్యం

చిన్నప్పుడెప్పుడో చదివినట్టు గుర్తు. ఒకతనికి ఇంకొకతనంటే ద్వేషముంది. శతృత్వం ఉంది.  అందుకని ఇతన్ని చంపడానికి విషం ఇస్తాడు. ఎందువల్లనో కానీ ఆ విషం అతన్ని ఏమీ చేయదు.

ఒక వైద్యుడు ఉంటాడు. అతని దగ్గరకి ఎందరో రోగులు వస్తుంటారు. ఒకసారి ఓ రోగికి ఏదో జబ్బు వస్తే ఇతను మందు వేస్తాడు. కానీ ఆ రోగి చనిపోతాడు.

స్థూలంగా చూస్తే ఫలితం : మొదటి ఉదాహరణలో వ్యక్తి బతికాడు. రెండవ ఉదాహరణలో వ్యక్తి చనిపోయాడు. కానీ ఎవరికి పుణ్యం వస్తుంది? (పుణ్యం, పాపం ఇత్యాదివి నమ్మేవారికోసమే). 

ఓ పనికి ఫలితంతో సంబంధం లేకుండా ఏ ఉద్దేశ్యంతో ఆ పని చేసామన్నదే కావాలి.

నాకు సంబంధించినంత వరకు ఫలితం ఎంత అవసరమో, ఉద్దేశ్యం కూడా అంతే ముఖ్యం. ఎలాగైనా పని జరగాలి అని నేను కోరుకోను. ఒక పద్ధతిలోనే, కొన్ని ప్రమాణాల ప్రకారమే జరగాలని కోరుకుంటాను.

ప్రత్యుత్తరమిమ్ము