ఆశయ సాధన దిశగా

మనసుంటే మార్గముంటుంది అని మరోసారి నిరూపణ అయింది. LM Groups Forum ప్రయత్నం సఫలం అవడంతో, తర్వాతి కార్యక్రమాలు ఏమిటి, ఈ ప్రయత్నాన్ని నిరంతరం కొనసాగించడానికి, ఏమి కార్యక్రమాలు చేయాలి, ఎలా దీనిని ముందుకు నడపాలి….. ఇలా ఆలోచిస్తూనే ఉన్నా.

సెప్టెంబరు 16, ఆదివారం అనగా LMG Forum సమావేశం జరిగిన వారం రోజులకు మరో ప్రయత్నం ఫలప్రదమైంది. అది కూడా అనుకోకుండా.

ఆ రోజు నేను మా గ్రూపు సమావేశానికి హాజరు కావడానికి తయారవుతున్నాను. అప్పుడు డా !! సురేష్ అనే వ్యక్తి నుంచి ఫోను వచ్చింది. ఆయన First Ray Foundation వ్యవస్థాపకుడని, ఆ రోజు ఆశ్రయ్ – ఆకృతి హాస్టలులో పిల్లలకు అన్నదానం చేస్తున్నారని, ఈ నెలలో పుట్టినరోజులున్న గ్రూపు సభ్యుల పుట్టినరోజు వేడుకని అక్కడ జరుపుతున్నారని, నన్ను కూడా రమ్మని ఆహ్వానించారు.  ఆశ్రయ్ – ఆకృతి వ్యవస్థాపకులు శ్రీ బాబు గారు నా నంబరు ఇచ్చారని చెప్పారు. సహాయా గ్రూపు సభ్యులు కూడా కొంతమంది పాల్గొంటున్నారని చెప్పారు.

పోయిన వారం సాయం చేద్దాం గ్రూపుతో పాటు ఈ రెండు గ్రూపుల వారు వ్రాలేకపోయారు. సత్యాకృష్ణ, శరత్ ఇద్దరూ వీరి కార్యక్రమానికి హాజరయ్యారు సెప్టెంబరు 9 న. ఆ రోజు వారు బ్లైండ్ స్కూల్ కి వెళ్ళారు.

కాబట్టి నేను మా మీటింగ్ అయిపోగానే కొంత మంది సభ్యులతో ఆ కార్యక్రమానికి హాజరయ్యాను. నా ఉద్దేశ్యం వాళ్ళని కలిసి మాట్లాడాలి, LMG Forum గురించి చెప్పాలని.

ముందుగా నేను, సత్యాకృష్ణ, కార్తీక్ , శ్రీనివాస్ వెళ్ళాము. మేము వెళ్ళేటప్పటికే పిల్లల భోజనాలు అయిపోయాయి. మేము అక్కడి వాలంటీర్లతో పాటు భోజనం చేసాము. తరువాత డా !! సుందర్ , నరేష్ గారు కూడా వచ్చారు.

కేకు చుత్ చేసారు. అలాగే మరి కొంత మంది ఉపన్యసించారు. సురేష్ ప్రసంగం నాకు బాగా నచ్చింది. లైక్ మైండెడ్ అనే మాట అక్షరాలా సరిపోయింది అనిపించింది.

ఇక్కడి పిల్లల కోసమే మేము కొన్న పుస్తకం ఒకటి అక్కడి వార్డెన్ కు ఇచ్చాము. మా గ్రూపు సభ్యులందరూ వెళ్ళిపోయినా నేను మాత్రం ఉండిపోయాను ఎందుకంటే ఈ గ్రూపు సభ్యులతో సావకాశంగా మాత్లాడుదామని. ఆ రోజు కార్యక్రమం చాలా బాగా జరిగింది. అందరూ ఉత్సాహవంతులే.

 LMG Forum  లో మరో రెండు ఉత్సాహవంతమైన గ్రూపులు సభ్యులుగా మారాయి.

ప్రత్యుత్తరమిమ్ము