sep 13, 2007

అసలు నేను భూమిక కి మేడ్ గ్రూపు మీద వ్యాసం వ్రాసి పంపాలి. వ్రాయనే లేదు. చాలా కారణాలున్నాయి. పత్రిక కి కదా ఇంకా బాగా వ్రాయాలని. అలాగే కొన్ని ప్రశ్నలకి సమాధానాలు ఆలోచిస్తుండడం మూలాన కూడా కావచ్చు.

రెండవ వార్షికోత్సవం జరుపుకున్న దగ్గర నుంచి ఒక రకంగా మా గ్రూపుకి దిష్టి తగిలిందా అన్నట్లుంది. నేను విపరీతమైన ఒత్తిడికి లోనయ్యా. అత్యంత ఒంటరిగా ఫీల్ అయ్యా. ఆశ, నిరాశల మధ్య, బాధ, ఆనందాల మధ్య నా మనసు ఊగిసలాడుతోంది.

దానికి తోడు పని కూడా బాగానే ఉంది. అన్యమనస్కంగాను, అసంపూర్ణంగాను ఏదీ చేయలేను నేను. రేపు ఈ సమయానికైనా వ్రాయాలని అనుకుంటున్నాను.

మొత్తానికి ఏదైతేనేమి అనుకున్నట్టుగా బ్లాగు కోసం కొంత సమయం వెచ్చిస్తున్నా. అయితే నియంగా సభ్యుల గురించి, గ్రూపు గురించి ప్రతి రోజూ ఒక టపా అయినా ఉండేటట్లు వ్రాద్దామని అనుకుంటున్నాను.

ప్రసాదు గారి వ్యాఖ్య చదివాను. అలాగే సౌమ్య, నాగరాజా గార్లు చెప్పింది కూడా. ఎలాగూ అప్ డేట్ చేస్తున్నాను అని తెలిసిందిగా, ఇక కేవలం సేవ్ చేసి పెట్టుకోవడం ఎందుకు! అలా ఎందుకు అనుకున్నానంటే గ్రూపు గురించి, సభ్యుల గురించి అయినా సమగ్రంగా వ్రాస్తే చదివే వారికి బాగుంటుంది కదా అని. అంతే.

కవిత వ్రాసాక దాన్ని దాచి ఉంచడం వీలవుతుందా!! ఇది కూడా అలాంటిదే. వ్రాయడం అంటూ జరిగితే పోస్టు చేసే దాకా పిల్ల తిరగదు నాకు :) అంటే ఏమిటి అని అడగకండి. నాకు తెలీదు. అది మా బంగారు ఆండాళ్ళు (మా అమ్మమ్మ) పదప్రయోగం.

2 స్పందనలు

  1. ఎంత సంతోషంగా ఉన్నదో!

    మీరు ఇలా బ్లాగు వ్రాయడమూ,

    మీరు ఇలా బ్లాగు ఠపా పైన ఠపా వ్రాయడమూ.

    తెలుగు బ్లాగులు సెలబ్రేట్ చేసుకోవాలి మీ రాకకు.

  2. ఏదైనా ఒక గొప్ప కార్యం నెరవేర్చాలంటే, ఎన్నో మార్లు నెగటివ్ భావాలను/సంఘటనలను ఎదుర్కోక తప్పదేమో! ఒక రకంగా అవి మనకు తదుపరి అడుగును వేసేందుకు, వ్యక్తిగత ఎదుగుదలకు దోహదం చేస్తాయి అనుకుంటాను.

ప్రత్యుత్తరమిమ్ము