ఫిబ్రవరి 2, 2006

ఎవరికైనా ఫిబ్రవరి అనగానే 14 వ తేదీ గుర్తొస్తుంది :) నాకు ఏమిటి రెండో తేదీ అనుకుంటున్నారా……నా జీవితంలో ఆ తేదీకి పెద్ద ఔచిత్యమే ఉంది మరి.

తలస్సీమియా వ్యాధి గురించి మొదటిసారి డా !! సుమన్ జైన్ గారి ద్వారా విన్నాక, అక్కడి పిల్లల దుస్థితి చూసాక, ఆవేశంగా అనుకున్నా, నేను నా బ్లడ్ గ్రూపు తెలుసుకోవాలి, నా బ్లడ్ గ్రూపున్న తలస్సీమియా బాలికకు శాశ్వత డోనార్ గా మారాలి అని. అనుకోవడమైతే అనుకున్నాను. అమల్లో పెట్టాలి అనే నిబద్ధతైతే ఉంది. కానీ ఏమి లాభం. విపరీతమైన భయం. ఏదో ఒక సాకుతో సర్దిచెప్పుకునేదాన్ని.

ఎట్టకేలకు చంద్ర గారు, సౌమ్య కలిసి మా మంత్లీ మీటింగ్ (ఫిబ్రవరి 2, 2006 న) అవగానే తీసుకెళ్ళారు. ఆ ఆసుపత్రిని చూడగానే పారిపోదాము అనిపించింది. ఎందుకొచ్చిన ఆవేశం రా భగవంతుడా, అనవసరంగా అనుకున్నానే అని తిట్టుకున్నా. సౌమ్య, చంద్రగారు నాకు పారిపోయే మహదవకాశాన్ని కల్పించలేదు. కానీ ఏ మాటాకామాటే చెప్పుకోవాలి. ఆ రోజు పరీక్ష చేసిన అబ్బాయి కూడా నొప్పి లేకుండా తీసాడు. 

నాది A +ve అని తెలిసింది. ఆ రోజు నా ఆనందాన్ని నేను వర్ణించలేను. బహుశా మనం అంతగా ఎదురుచూడనిది, కోరుకోనిది, అనుకుని పొందిన వేళ, అదొకలాంటి భావన. ఆ క్షణం నుంచి ఈనాటి వరకు, రక్తదానం చేసేవరకు కూడా ఎప్పుడెప్పుడా అని ఎదురుచూపే.

2 స్పందనలు

  1. ప్రశాంతి గారు, మీరు బ్లాగులు కూడా రాస్తారు అని ఈ రొజె తెలిసింది. మీ సెవా భావం మిమ్మలని ఎల్లప్పుడు కాపాడుతుంది.

  2. meeru maree sunnita manassu gala vaarilaa vunnarandi.

ప్రత్యుత్తరమిమ్ము