సేవ – స్పందన

Likeminded Groups ని ఎందుకు కలపాలి. దీని ద్వారా నేను ఆశించేది ఏమిటి? ఎందుకు నేను అందరినీ ఒక వేదిక పైకి తీసుకురావాలని ఆరాటపడుతున్నాను? కొన్ని పోస్టుల ద్వారా నా భావాలను తెలియచేస్తాను.

ముందుగా కొన్ని ప్రశ్నలు వేసుకుందాము:

సమాజంలో నిత్యం ఎన్నో జరుగుతుంటాయి, మంచివి, చెడ్డవి. వాటి పట్ల మన ప్రతిస్పందన ఏమిటి? తోటి వారికి సాయం చేయాలి అనుకోగానే మనలో కలిగే ఆలోచనలు ఏమిటి?

ఉదాహరణకు:
ఏమి సాయం చేయాలి? ఏలా చేయాలి?
ఈ సాయమే ఎందుకు చేయాలనుకుంటున్నాను?
ఇంతకన్నా ఇంకా బాగా చేయచ్చా? ఇంకా గొప్ప ప్రయోజనం పొందగలమా?

సమాధానాలు:

ఏమి చేసినా సాయమే. బాధలో ఉండే వారికి ఓదార్పు మాటలు పలికి సాంత్వన కలిగించినా, ఓ చిరునవ్వు రువ్వి ఆనందం కలిగించినా అది సాయమే.

డబ్బులు ఇవ్వడం ఒక పధ్ధతి. ఎవరికి ఇవ్వాలి? సద్వినియోగపరిచేవారికి ఇవ్వాలి.

డబ్బులు కాకుండా, సమయం ఎక్కువ వెచ్చించనక్కరలేకుండా చేయగలిగేవి:
బాగా ఉండి మనం ఎక్కువగా వాడని దుస్తులు ఇవ్వడం.
పాత పుస్తకాలు పంచడం.

రక్తదానం చేయడం.

కళ్ళని, అవయవాలని దానం చేసేందుకు సంసిద్ధత వ్యక్తత చేస్తూ మన పేరు నమోదు చేసుకోవడం.

సమయం వెచ్చించి చేసేవి:

పేద పిల్లలకి పాఠాలు చెప్పడం. ప్రభుత్వ పాఠశాలలు, మురికివాడలు, అనాథాశ్రమాలు ఇలాంటి చోట్లకి వెళ్ళి చెప్పచ్చు. అనాథాశ్రమాలకు, వృధ్ధాశ్రమాలకు వెళ్ళి అక్కడి వారికి ప్రేమను పంచి ఇవ్వచ్చు. మానసిక వికలాంగుల (ఇలా అనకూడదు అని తెలుసు. ఆంగ్లంలో అయితే Differentially abled, visually challenged అని అంటారు. తెలుగులో ఏమనాలో తెలియదు) ను కలిసి వారితో సరదాగా గడపచ్చు. (సరదా అని ఎందుకు అంటున్నానంటే ఒకసారి నేను వారిని కలిసాను కాబట్టి. ఆ వివరాలు వేరొక పోస్టులో వ్రాస్తాను.)

ప్రత్యుత్తరమిమ్ము